నిజామాబాద్ లో దారుణం.. లారీని ఢీ కొన్న కారు, ఇద్దరు సజీవదహనం..

By SumaBala BukkaFirst Published Jun 27, 2022, 6:40 AM IST
Highlights

ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి కారులోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 

నిజామాబాద్ :  Nizamabad జిల్లాలోని వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద ఘోర road accident జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో వెంటనే కారులో fires చెలరేగాయి. దీంతో కారులో చిక్కుకుపోయిన ఇద్దరు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా, జూన్ 24న ఏలూరులో ఇద్దరు వ్యక్తులు ఇలాగే సజీవ దహనం అయ్యారు. వీరిద్దరూ అన్నాదమ్ములే. విద్యుత్ షాక్ గురయి ఒకేసారి దుర్మరణం చెందడం ఏలూరు జిల్లాలో న విషాదాన్ని నింపింది.  ఒకేసారి ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరి మృతుకి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెడితే.. జంగారెడ్డి గూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన వల్లేపల్లి నాగేంద్ర, ఫణీంద్ర సోదరులు. పెద్దోడు బిటెక్, చిన్నవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నారు. 

దారుణం : రెండేళ్ల చిన్నారిపైకి దూసుకెళ్లిన కారు.. రాష్ డ్రైవింగ్‌కు పసిప్రాణం బలి

అయితే, ఇటీవల తండ్రికి అనారోగ్యం చేసింద. దీంతో నాగేంద్ర, ఫణీంద్ర ఇద్దరూ ఆ రోజు తెల్లవారుజామున పాలు పితకడానికి పొలానికి వెడుతున్నారు. ఆ సమయంలో ఈ ఘోరం జరిగింది. రాత్రి ఎప్పుడో 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి రహదారిపై పడ్డాయి. గ్రామస్తులు కానీ, విద్యుత్ శాఖ అధికారులు గానీ ఇది గమనించలేదు. దీంతో అన్నాదమ్ములు బైక్ మీద వెళుతుండగా విద్యుత్ సరఫరా అవుతున్న తీగలు తగిలాయి. దీంతో ఒక్కసారిగా బైక్ కు మంటలు అంటుకున్నాయి. అది గమనించేలోపే.. రెప్పపాటులో సోదరులిద్దరికీ మంటలు వ్యాపించాయి. వారు తేరుకుని బండి దిగే లోపే  ఇద్దరు యువకులు సజీవ దహనం అయి.. అక్కడికక్కడే దుర్మరణం చెందారు.   

ఇలా ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో ఆ కుటుంబంలోనే కాదు దేవులపల్లిలో విషాదం అలుముకుంది. నాగేంద్ర, ఫణీంద్ర ల మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.  మృతుల కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న లక్కవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.  రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ఇదిలా ఉండగా, జూన్ 10న స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ దారుణమైన సంఘటన బీవండి స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సంతోష్ చౌరాసియా తన భార్య కవిత, ఇద్దరు పిల్లలతో కలిసి కేంద్రంలోని మహాంకాళి దాబా పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. కూలీ పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరచుగా భార్యతో గొడవ పడేవాడు.

ఆ రోజు మద్యం సేవించిన సంతోష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశంతో సంతోష్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వచేసిన కర్రలకుప్ప దగ్గరకు కవితను లాక్కొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి.. నిప్పు అంటించి.. హత్య చేసి పారిపోయాడు.  పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

click me!