తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్‌పై గందరగోళానికి తెర.... ఫలితాలు ఎప్పుడంటే..?

By Siva KodatiFirst Published Jun 26, 2022, 10:11 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై క్లారిటీ వచ్చింది. జూన్‌ 28న ఉదయం 11 గంటలకి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. 
 

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షా ఫలితాలపై సస్పెన్స్ వీడింది. అయితే పలు కారణాల వల్ల ఫలితాల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఫలితాల తేదీని అధికారికంగా ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డ్. మంగళవారం (జూన్‌ 28)న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ ఫలితాలను విడుదల చేయనున్నాట్లు వెల్లడించింది బోర్డ్. జూన్‌ 28న ఉదయం 11 గంటలకి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

కాగా.. తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మే 24వ తేదీన పూర్తయ్యాయి. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియర్ పరీక్షలు రాయగా.. వీరిలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, వొకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఆ సమయంలో 20 రోజుల తర్వాత ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు ప్రకటించారు. ఆ లెక్కన చూసుకుంటే జూన్‌ 15న ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. కానీ ఈ తేదీ మారుతూనే వచ్చింది. ఇటీవల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) జూన్‌ 25 నాటికి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఫలితాలు ఆలస్యమైనా పర్లేదు కానీ ఫలితాల్లో ఎలాంటి తప్పులు దొర్లకూడదని తెలిపారని వార్తలు వచ్చాయి. దీంతో శనివారం ఫలితాలు వస్తాయని అందరూ భావించారు. కానీ రిజల్ట్స్‌పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. 

 


 

click me!