రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ హత్య కేసు మరో మలుపు తీసుకుంది. ఆయన హత్యతో బాబా త్రిలోక్ నాథ్ పాత్ర మాత్రమే కాకుండా ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.
హైదరాబాద్: రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ హత్య కేసు మలుపు తిరిగింది. విజయ్ భాస్కర్ హత్యతో నెల్లూరు జిల్లాకు చెందిన త్రిలోక్ నాథ్ పాత్రతో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరనేది బయటకు రాలేదు.
ఇటీవల హైదరాబాదులోని నివాసం నుంచి నలుగురు వ్యక్తులు విజయ్ భాస్కర్ ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత హత్య చేసిన విషయం తెలిసిందే. బాబా విషయం వెలుగులోకి రాకుండా అతని శిష్యులు విజయ్ భాస్కర్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది. బాబా చేస్తున్న పనులను విజయ్ భాస్కర్ బయటపెడుతున్నానే కోపంతో ఆ పనికి పూనుకున్నట్లు చెబుతున్నారు.
undefined
Also Read: కూకట్‌పల్లి రియల్టర్ విజయ్‌భాస్కర్ రెడ్డి హత్య: 4 రాష్ట్రాల్లో గురూజీ కోసం పోలీసుల గాలింపు
త్రిలోక్ నాథ్ బాబా విజయ్ భాస్కర్ ద్వారా హకీంపేటలో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిలో త్రిలోక్ నాథ్ బాబాతో పాటు మాజీ ఎమ్మెల్యే గుప్తనిధుల కోసం, లోహాల కోసం అన్వేషణ సాగించినట్లు తెలుస్తోంది. ఆ విషయాలు విజయ్ భాస్కర్ కు తెలియడంతో బయటకు చెబుతున్నాడని త్రిలోక్ నాథ్ బాబా అనుమానించినట్లు సమాచారం.
విజయ్ భాస్కర్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నలుగురిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఆ విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న త్రిలోక్ నాథ్ బాబా కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయ్ భాస్కర్ ను హత్య చేసి అతని శవాన్ని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వద్ద తగులబెట్టారు.
Also Read: హైదరాబాద్ రియల్టర్ కిడ్నాప్, హత్య: నలుగురి అరెస్టు, బాబా కోసం గాలింపు