అన్నతో నిశ్చితార్థం, తమ్ముడితో పెళ్లి.. తట్టుకోలేక ఆ నవవధువు చేసిన పని...

Published : Aug 09, 2021, 10:53 AM IST
అన్నతో నిశ్చితార్థం, తమ్ముడితో పెళ్లి.. తట్టుకోలేక ఆ నవవధువు చేసిన పని...

సారాంశం

నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన బాలాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్ బేగం (25)తో జలపల్లి న్యూబాబానగర్ నివాసి  మీర్ ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి 28 రోజుల క్రితం వివాహం జరిగింది. 

పహాడీ షరీష్ : జీవితాంతం కలిసి ప్రయాణం చేయాల్సిన వాళ్ల అంగీకారం లేకుండా పెళ్లిళ్లు చేయడంతో ఎన్నో జంటలు ఇబ్బందుల్లో పడతుంటాయి. నేటికీ ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పిల్లల అంగీకారం తెలుసుకోకుండా.. పెద్దలు చేసిన ఓ పెళ్లి విషాదానికి దారి తీసింది. 

నవ వధువు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన బాలాపూర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ వట్టెపల్లికి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిన్ బేగం (25)తో జలపల్లి న్యూబాబానగర్ నివాసి  మీర్ ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి 28 రోజుల క్రితం వివాహం జరిగింది. 

మూడేళ్ల క్రితమే ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ అన్నయ్యతో ఆమెకు నిశ్చితార్థం అయ్యింది.అనంతరం సోదరులిద్దరూ ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్లారు. కరోనా నేపథ్యంలో అతడు ఇంటికి రాలేదు. నెలన్నర క్రితం ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ తిరిగి వచ్చాడు.  

పెద్దకుమారుడు ఆచూకీ లేకపోవడంతో రెండు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్ బేగంను  ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి ఇచ్చి జూలై 12 న పెళ్లి చేశారు. సోదరుడికి నిశ్చితార్థం అయిన అమ్మాయి తో తనకు వివాహం చేశారంటూ అలీ తీవ్రంగా మదన పడేవాడు.

భార్యగా అంగీకరించలేనంటూ ఆమెను మానసికంగా వేధించేవాడు. దీనికితోడు కట్నకానుకల విషయమై  అత్తమామల నుంచి సైతం వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో కలత చెందిన షాహీన్ బేగం శనివారం తన గదిలోని ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu