హెచ్‌సీఏలో కీలక పరిణామం: అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేసిన అంబుడ్స్‌మన్

By Siva KodatiFirst Published Jul 4, 2021, 4:52 PM IST
Highlights

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌కు చుక్కెదురైంది. తదుపరి విచారణ వరకు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు అంబుడ్స్‌మన్. 
 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అపెక్స్ కౌన్సిల్‌కు చుక్కెదురైంది. తదుపరి విచారణ వరకు అపెక్స్ కౌన్సిల్‌ను రద్దు చేశారు అంబుడ్స్‌మన్. కాగా, హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)లో వివాదం ముదురుతోంది. అజరుద్దీన్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ జాన్ మనోజ్ ను తాత్కాల్కి అధ్యక్షుడిగా నియమించినట్లు అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్ ఘాటుగా స్పందించారు. 

తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియామకం చెల్లదని అజరుద్దీన్ అన్నారు. కావాలనే తనపై అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ లో ఉన్నారని చెబుతున్న ఐదుగురు కూడా దొంగలేనని ఆయన అన్నారు. దొంగలే.. దొంగలు దొంగలంటూ అరుస్తున్నారని ఆయన అన్నారు. అపెక్స్ కౌన్సిల్ లో ఉన్న ఐదుగురిపై ఏసీబీ కేసులున్నాయని, వాళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. అపెక్స్ కౌన్సిల్ నోటీసులు ఇచ్చినా చెల్లవని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని ఆయన అన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనేదే బూటకమని అజరుద్దీన్ అన్నారు.

Also Read:బీసీసీఐ జోక్యం చేసుకునే పరిస్ధితి, అజార్ పద్ధతి బాలేదు: హెచ్‌సీఏ మాజీ సెక్రటరీ శేష నారాయణ

ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న జాన్ మనోజ్ ను అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. అపెక్స్ కౌన్సిల్ లో ఐదుగురు సభ్యులు ఉన్నారు. వారు కార్యదర్శి ఆర్ విజయానంద్, జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి నరేష్ శర్మ, కోశాధికారి సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్ పి. అనురాధ. వారు గత కొంత కాలంగా అజరుద్దీన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.  జూన్ 10వ తేదీన ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో అజరుద్దీన్ ను సస్పెండ్ చేశారు.  

click me!