57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.
సిరిసిల్ల: 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఆదివారం నాడు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్ ను అమలు చేస్తామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా కేబినెట్ సమావేశం నిర్వహించి పెన్షన్ ను అమలు చేస్తామన్నారు. వచ్చే నెల తర్వాత కొత్త పెన్షన్ ను అమల్లోకి వస్తోందన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ వారికి ఏమీ చేతకాదనే అపవాదు ఉండేదన్నారు. రాష్ట్రంలోని కొత్త కలెక్టరేట్ భవనాలను డిజైన్ చేసింది తెలంగాణ బిడ్డ ఉషారెడ్డే ఆయన సభకు పరిచయం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు కొత్త కలెక్టరేట్ భవనం నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం.
undefined
also read:రైతు భీమా మాదిరిగా చేనేత కార్మికులకు భీమా: కేసీఆర్ హామీ
85 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టును ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో రాయలసీమ చెందిన ఎమ్మెల్యేలు బాంబులతో పేల్చారని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత రెండేళ్లకే తాను తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆలంపూర్ నుండి గద్వాల వరకు పాదయాత్ర చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.వలస వెళ్లిన వారంతా గ్రామాలకు వెనక్కి వస్తున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 10 వేల కోట్ల విద్యుత్ బిల్లులైనా భరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతోందా అని అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. పాల్వంచవాగు, కూడవెల్లి వాడు కలిసి దగ్గర కట్టిందే అప్పర్ మానేరు ప్రాజెక్టు అన్నారు. వరద కాల్వ ఒక రిజర్వాయర్ అవుతోందని ఎవరూ కూడ ఊహించలేదని ఆయన చెప్పారు.సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మరో 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేందుకు గాను ప్లాన్ చేస్తున్నామని సీఎం వివరించారు.