కృష్ణా జల వివాదం.. ప్రశ్నించినందుకే పీజేఆర్‌‌ను, వైఎస్ కేబినెట్‌లోకి తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

By Siva KodatiFirst Published Jul 4, 2021, 4:16 PM IST
Highlights

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనం లాంటిదని ఆనాడే పీజేఆర్‌ హెచ్చరించారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదట పోరాడింది జనార్దన్‌రెడ్డి అని ఆయన గుర్తుచేశారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తెలంగాణకు మరణశాసనం లాంటిదని ఆనాడే పీజేఆర్‌ హెచ్చరించారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొదట పోరాడింది జనార్దన్‌రెడ్డి అని ఆయన గుర్తుచేశారు. పీజేఆర్ చనిపోయిన తర్వాత తెలంగాణ తరఫున బలంగా పోరాడే నేత లేకుండా పోయారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల విషయంలో గళమెత్తినందుకే పీజేఆర్‌ను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకోలేదని గుర్తుచేశారు.

Also Read:చెప్పుల దండ వేయిస్తా: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని పీజేఆర్‌ ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. ఆయన కుమారుడు విష్ణువర్దన్‌రెడ్డిని కలిశారు. పీజేఆర్ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం పీజేఆర్‌ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను తరలించాలని పీజేఆర్ పోరాటం చేయడం వల్లనే నగరంలో నీటి సమస్య పరిష్కారమైందని రేవంత్ రెడ్డి తెలిపారు. 

click me!