
ఉప్పల్ లోని ఉజ్వల హోం నుంచి 12 మంది మహిళలు పరారయ్యారు. వారంతా ఉజ్వల హోం నిర్వాకులపై దాడి చేయడంతోపాటు నిర్వాహకులను గదిలో బంధించి పారిపోయారు.
ఈ సంఘటనపై హోం నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వ్యభిచారం కేసులో పోలీసులకు చిక్కిన మహిళలను ఉప్పల్ లోని ఉజ్వల హోం కు తరలిస్తారు.
12 మంది మహిళలు ఈ కేసులో పోలీసులకు చిక్కడంతో కొన్ని రోజులుగా ఉప్పల్ లోని ఉజ్వల హోంలో ఉంటున్నారు.
అకస్మాత్తుగా వారు గురువారం నిర్వాహకులపై దాడికి దిగారు. అందరూ ఏకమై దాడికి పాల్పడి నిర్వావాహకులను బంధించి పరారయ్వయారు.
దీంతో తేరుకున్న నిర్వాహకులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.