బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్

Published : Jun 22, 2017, 04:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
బతుకమ్మ చీరలు వచ్చేస్తున్నాయ్

సారాంశం

తెలంగాణలో బతుకమ్మ చీరలు రెడీ అవుతున్నాయి. బతుకమ్మ పండుగ రోజున తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరలను తెలంగాణ సర్కారు కానుకగా అందజేయనుంది. కోటి మందికి పంపిణీ చేసేందుకు బతుకమ్మ చీరలను రెడీ చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను తయారు చేయిస్తోంది. నేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ సర్కారు  ప్రత్యేకంగా బతుకమ్మ చీరలను తయారు  చేయించే కార్యక్రమానికి పూనుకుంది. సిరిసిల్లలో ఇప్పటికే కోటి చీరలను చీరలు తయారవుతున్నయి. ముస్లిం ప్రజలకు రంజాన్, క్రిస్టియన్లకు క్రిస్టమస్ నాడు కొత్త దుస్తులు అందించింది తెలంగాణ సర్కారు. అలాగే హిందూ మతంలోని పేద  ప్రజానీకానికి బతుకమ్మ, దసరా పండుగల వేళ కొత్త వస్త్రాలను అందజేసే  కార్యక్రమానికి సర్కారు కసరత్తు చేస్తోంది. అందుకోసమే బతుకమ్మ చీరలను తయారు చేయిస్తోంది. దీనికోసం టెస్కో ద్వారా 200 కోట్ల రూపాయలను సర్కారు ఖర్చు చేస్తోంది.

 

మంత్రి  కెటిఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో నేత కార్మికులు పనిచేస్తున్నారు. వారికి మెరుగైన ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే అక్కడి కార్మికుల చేత బతుకమ్మ చీరలను తయారు చేయిస్తోంది సర్కారు. మరోరెండు మూడు నెలల్లోనే బతుకమ్మ చీరలు తెలంగాణలో కొత్త శోభను తీసుకురానున్నయి. దారిధ్ర్య రేఖకు దిగువన ఉన్నవారందరికీ ఈ బతుకమ్మ చీరలను అందించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నది.

 

బతుకమ్మ చీరల తయారీపై మంత్రి కెటిఆర్ గురువారం సమీక్ష జరిపారు. చీరల తయారీ పూర్తి చేసి పంపిణీకి సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు