వైఎస్ షర్మిలను కలిసిన టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి

By narsimha lodeFirst Published Oct 24, 2021, 4:59 PM IST
Highlights


టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆదివారం నాడు కలిశారు. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ Ys Sharmila పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన చేవేళ్ల అసెంబ్లీ నియోకవర్గంలో షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: పాదయాత్ర చేస్తున్న YSRTP చీఫ్ వైఎస్ షర్మిలను టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం నాడు కలిశారు.  పాదయాత్ర  ఆదివారం నాటికి ఐదో రోజుకు చేరుకొంది.ఇవాళ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది.ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ఆర్‌టీపీ చీఫ్ Ys Sharmila పాదయాత్ర చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన చేవేళ్ల అసెంబ్లీ నియోకవర్గంలో షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

also read:కేసీఆర్ కి సవాల్.. కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర..!

తాజా రాజకీయ పరిణామాలతో షర్మిలతోYv Subba Reddy  భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఆదివారం నాగారం గ్రామంలో షర్మిల బస చేసిన సమయంలో సుబ్బారెడ్డి ఆమెను కలిశారు.తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల రాజన్న రాజ్యం సాధించేందుకు వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని  షర్మిల ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తే తాను పాదయాత్రను నిలిపివేస్తానని ఆమె తేల్చి చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో  పార్టీ కార్యక్రమాలకు వైసీపీ దూరంగా ఉంది. ఈ తరుణంలో షర్మిల పార్టీని ఏర్పాటు చేసింది.  

వైసీపీలో కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది. షర్మిలతో సుబ్బారెడ్డి ఏ విషయమై చర్చించారనేది స్పష్టత రావాల్సి ఉంది.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి Chevella అసెంబ్లీ నియోజకవర్గం నుండే padayatra ప్రారంభించారు.ఈ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాదయాత్ర తర్వాత 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకొన్నారు.

అయితే అవశేష ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ పాదయాత్ర తర్వాత టీడీపీని గద్దెదింపి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు పార్టీ 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసింది వైసీపీ.ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్ర ఏ మేరకు తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనేది  వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. అయితే అప్పటివరకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు లేకపోలేదు.

click me!