Hyderabad: రక్షా బంధన్ అన్నదమ్ముల ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరుడి చేతికి రాఖీ కడతారు, దీనికి బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతి ఇవ్వడంతో పాటు ఆమెను జీవితాంతం కాపాడతానని వాగ్దానం చేస్తాడు. కాగా, రాఖీ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మూడు వేల స్పేషల్ బస్సులను నడపనుంది.
TSRTC-Raksha Bandhan-Special Buses: రక్షా బంధన్ అన్నదమ్ముల ప్రేమ, సామరస్యానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున, సోదరీమణులు తమ సోదరుడి చేతికి రాఖీ కడతారు, దీనికి బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతి ఇవ్వడంతో పాటు ఆమెను జీవితాంతం కాపాడతానని వాగ్దానం చేస్తాడు. కాగా, రాఖీ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మూడు వేల స్పేషల్ బస్సులను నడపనుంది.
వివరాల్లోకెళ్తే.. రాఖీ పండుగ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుందని సంబంధిత అధికారులు ప్రకటించారు. రాబోయే రక్షాబంధన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి బస్సు ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో రోజుకు వెయ్యి సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించారు.
టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రయాణికులకు కల్పిస్తున్న ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్షించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, గోదావరిఖని, మంచిర్యాల, ఏటీసీ వెళ్లే రూట్లలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, జేబీఎస్, ఎంజీబీఎస్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను మోహరించారు.
గత ఏడాది రక్షా బంధన్ సందర్భంగా ఆర్టీసీకి ఒకే రోజు రూ.20 కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తం ఆక్యుపెన్సీ రేటు 87 శాతంగా నమోదు కాగా, 12 బస్ డిపోల్లో 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ''ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఈ ఆదాయం రాలేదు. గత అనుభవాల ఆధారంగా ఈ ఏడాది కూడా ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టాలనుకుంటున్నాం'' అని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు, రవాణా శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం www.tsrtconline.in లేదా 040-69440000 లేదా 040-23450033 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.