3 గంట‌ల కరెంటు కావాలా? 3 పంట‌ల బీఆర్ఎస్‌ కావాలా?.. కాంగ్రెస్ ను త‌రిమి కొట్టాలంటూ మంత్రి ఎర్ర‌బెల్లి పిలుపు

Published : Aug 27, 2023, 12:28 AM IST
3 గంట‌ల కరెంటు కావాలా? 3 పంట‌ల బీఆర్ఎస్‌ కావాలా?.. కాంగ్రెస్ ను త‌రిమి కొట్టాలంటూ మంత్రి ఎర్ర‌బెల్లి పిలుపు

సారాంశం

Palakurthy: ఎస్టీలలో వ‌ర్గీక‌ర‌ణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంద‌నీ, ఆ పార్టీని న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్లేన‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ‌మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన తండాబాట‌లో మంత్రి మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, 3 గంట‌ల కరెంటు కావాలా? 3 పంట‌ల బీఆర్ఎస్‌ కావాలా? అని పిలుపునిచ్చిన ఎర్ర‌బెల్లి.. కాంగ్రెస్ ను త‌రిమి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.   

BRS MLA Errabelli Dayakar Rao: ఎస్టీలలో వ‌ర్గీక‌ర‌ణ చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంద‌నీ, ఆ పార్టీని న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్లేన‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ‌మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన తండాబాట‌లో మంత్రి మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. అలాగే, 3 గంట‌ల కరెంటు కావాలా? 3 పంట‌ల బీఆర్ఎస్‌ కావాలా? అని పిలుపునిచ్చిన ఎర్ర‌బెల్లి.. కాంగ్రెస్ ను త‌రిమి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు నిచ్చారు.

వివ‌రాల్లోకెళ్తే.. అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి వున్న ఎస్టీల్లో వ‌ర్గీక‌ర‌ణ చిచ్చు పెట్ట‌డానికి కాంగ్రెస్ కుట్ర‌ప‌న్నుతోందని మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.  "రైతుల న‌డ్డి విర‌వ‌డానికి 3 గంట‌ల క‌రెంటు చాలంటోంది కాంగ్రెస్. 24 గంట‌ల క‌రెంటు కావాలా? 3 గంట‌ల క‌రెంటు కావాలా? 3 పంట‌ల బీఆర్ఎస్ కావాలా? ప్ర‌జ‌లు తేల్చుకోవాలి. ప్ర‌జ‌ల్ని విభ‌జించి పాలించే కుట్ర‌లు ప‌న్నుతున్న కాంగ్రెస్ నేత‌ల‌ను మ‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాలు పెట్ట‌నివ్వ‌వ‌ద్దు. త‌రిమి కొట్టి మ‌న‌ల్నిమ‌నం కాపాడుకోవాలి. మ‌న కోసం పాటుప‌డుతున్న సీఎం కేసీఆర్ కు, నాకు అండ‌గా నిల‌వాలని" రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ‌మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

అలాగే, "క‌ష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియ‌ని వాళ్ళు మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌లు అయిపోతే వారు వెళ్ళిపోతారు. మ‌న‌మే ఎప్ప‌టికీ ఇక్క‌డే ఉంటాం" అని ఆయ‌న అన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో తండా బాట కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన మంత్రి, శ‌నివారం పాల‌కుర్తి మండ‌లంలోని బ‌మ్మెర‌ పెద్ద తండా, ఎన్టీఆర్ న‌గ‌ర్ తండా, కిష్టాపురం తండా, న‌ర్సింగాపురం తండా, మైలారం తండా గ్రామాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయా తండాల్లో మంత్రి ఒక్కో భ‌వ‌నానికి రూ.20ల‌క్ష‌ల చొప్పున‌ చేప‌ట్టిన నూత‌న పంచాయ‌తీ భ‌వ‌నాల‌కు శంకుస్థాప‌న చేశారు. అలాగే ప‌లు సిసి రోడ్ల‌కు మంత్రి శంకుస్థాప‌న చేశారు. బ‌మ్మెర పెద్ద తండా నుంచి కొండాపురం వెళ్ళే  బీటీ రోడ్డను ప్రారంభించారు. అలాగే అంత‌ర్గ‌త సీసీ రోడ్ల‌కు మంత్రి శంకుస్థాప‌న‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయా తండాల స‌ర్పంచ్ ల అధ్య‌క్ష‌త‌న, తండాల వార్డు స‌భ్యులు, నాయ‌కులు, ప్ర‌జ‌ల స‌మ‌క్షంలో జ‌రిగిన స‌భ‌ల‌లో మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, గ్రామాల‌కు ధీటుగా తండాల‌ను తాను అభివృద్ధి చేస్తున్న‌ట్లు చెప్పారు. తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగాచేయ‌డ‌మేగాక‌, ఒక్కో తండాకు కోటి రూపాయ‌ల‌తో అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన‌ట్లు వివ‌రించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ మ‌ధ్య ఎస్టీల్లో వ‌ర్గీక‌ర‌ణ చిచ్చు పెడుతున్న‌ద‌నీ, అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి ఉన్న ఎస్టీల‌ను విభ‌జించే కుట్ర ప‌న్నుతున్న‌ద‌ని ఆరోపించారు. కాంగ్రెస్ ని న‌మ్ముకుంటే న‌ట్టేట మునిగిన‌ట్లేన‌నీ, 3 గంట‌ల కరెంటు కావాలా? 3 పంట‌ల బీఆర్ఎస్‌ కావాలా?  కాంగ్రెస్ ను త‌రిమి కొట్టాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

అంత‌కుముందు,  మంత్రి ఎర్ర‌బెల్లికి ఆయా తండాల ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. బ‌తుక‌మ్మ‌లు, కోలాట నృత్యాలు, డ‌ప్పు వాయిద్యాలు, పూలు చ‌ల్లుతూ, తిల‌కం దిద్దుతూ స్వాగ‌తించారు. ఈ అభివృద్ధి కార్య‌క్రమాల్లో జిల్లా క‌లెక్ట‌ర్ శివ‌లింగ‌య్య‌, డిఆర్ డిఓ, జిల్లా పంచాయ‌తీ అధికారి, ఆయా తండాల ప్ర‌జ‌లు, స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారులు, పార్టీ క్యాడ‌ర్ పాల్గొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్