ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం.. సమ్మె యథాతథం: అశ్వద్ధామరెడ్డి

By Siva KodatiFirst Published Oct 3, 2019, 9:22 PM IST
Highlights

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ అధికారుల కమిటీ నిర్వహించిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రతి డిమాండ్‌ను పరిష్కరిస్తామని ఆర్టీసీ జేఏసీకి కమిటీ సభ్యులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ అధికారుల కమిటీ నిర్వహించిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రతి డిమాండ్‌ను పరిష్కరిస్తామని ఆర్టీసీ జేఏసీకి కమిటీ సభ్యులు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు.

అయితే అధ్యయనానికి నెలల సమయం కోరడంతో నేతలు ససేమిరా అన్నట్లుగా తెలుస్తోంది. చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి సమ్మె యథావిథిగా జరుగుతుందన్నారు.

ప్రభుత్వం, యాజమాన్యమే తమను సమ్మెలోకి నెట్టివేస్తున్నాయని.. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడటానికి తాము పోరాడుతున్నామని అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2,400 కోట్ల బకాయిలు ఇప్పించడంతో పాటు ఏడు వేల మంది కార్మికులు రిటైర్ అయినప్పటికీ 1.25 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడిపామన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి నడిచామని ప్రజల పక్షాన ఆలోచించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అశ్వద్ధామ రెడ్డి కోరారు. 
 

click me!