విజనరీ లీడర్‌షిప్ ఉంటేనే అభివృద్ధి: కేటీఆర్

By Siva KodatiFirst Published Oct 3, 2019, 7:19 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనమిక్ సదస్సులో పాల్గొన్న ఆయన.. టీఎస్‌ ఐపాస్ ద్వారానే ఇది సాధ్యమైందన్నారు

తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనమిక్ సదస్సులో పాల్గొన్న ఆయన.. టీఎస్‌ ఐపాస్ ద్వారానే ఇది సాధ్యమైందన్నారు.

విజనరీ లీడర్‌షిప్ ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని కేటీఆర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వెల్లడించారు. రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర పాలసీలు ఉండాలని.. దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా ఇప్పటికే 11 వేలకు పైగా అనుమతులను ఇచ్చామని .. ఇందులో 8400 పైగా అనుమతులు కార్యరూపం దాల్చాయని పేర్కొన్నారు. ఈ చట్టం వచ్చిన తర్వాత సుమారు 12 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని కేటీఆర్ స్పష్టం చేశారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే సదస్సుకు గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కేటీఆర్‌ను మే నెలలో ఆహ్వానించింది. మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్ అనే థీమ్ సదస్సును నిర్వహిస్తున్నారు.

గత మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్ సమ్మిట్ పేరుతో నిర్వహిస్తున్న సమావేశాల తాలూకు విషయాలపై ఇందులో చర్చ జరగనున్నట్లు తెలిపారు

click me!