ఈఎస్ఐ కుంభకోణం: డైరెక్టర్ పదవి నుంచి దేవికారాణి తొలగింపు

By Siva KodatiFirst Published Oct 3, 2019, 8:47 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ప్రధాన నిందితురాలు దేవికారాణిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను ఈఎస్ఐ డైరెక్టర్‌గా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేవికారాణి స్థానంలో ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ కొత్త డైరెక్టర్‌గా అహ్మద్‌ను నియమించింది. 

ఈఎస్ఐ స్కాంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలపుట్ట కదులుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం ఓమ్నీ సంస్థ ఏజెంట్ నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు. 

ఈసోదాలో భారీగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. అధికార పత్రాలు, సుమారు రూ.46 కోట్ల విలువైన ఇండెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా రూ.46 కోట్ల మేర విలువైన ఇండెంట్లు ఏజెంట్ల ఇళ్లలో లభ్యం కావడంతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 

ఈఎస్ఐ డైరెక్టర్ కార్యాలయంలో ఉండాల్సిన ఇండెంట్లు ఏజెంట్ నాగరాజు నివాసంలో ఉండటంపై అవినీతి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. 

ఇకపోతే ఈఎస్ఐ మందుల కుంభకోణంలో ఓమ్నీ మెడి సంస్థ నుంచి భారీగా ఔషధాలు, పరీక్షల కిట్లు ఈఎస్ఐ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితోపాటు పలువురు అధికారులు రిమాండ్ లో ఉన్నారు. 

click me!