తెలంగాణలో గ్రూప్-1 : 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

By narsimha lode  |  First Published Feb 19, 2024, 7:22 PM IST


తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.


హైదరాబాద్: తెలంగాణలో  గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన  గంటల వ్యవధిలోనే  కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 563 గ్రూప్-1 పోస్టులకు  టీఎస్‌పీఎస్‌సీ  నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల  23 నుండి మార్చి 14వ తేదీ వరకు  ఆన్ లైన్ లో ధరఖాస్తును స్వీకరించనున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ మాసంలో  ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్  లేదా అక్టోబర్ లలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.  

పోస్టుల వివరాలు

Latest Videos

undefined

గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్: 41 పోస్టులు
డీఎస్పీ:115 పోస్టులు
ఆర్డీఓ:04 పోస్టులు
డీపీఓ:07 పోస్టులు
జిల్లా రిజిస్ట్రార్:6 పోస్టులు
డిప్యూటీ కలెక్టర్లు: 45 పోస్టులు
సీటీఓ:48 పోస్టులు
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండ్:30 పోస్టులు
సాంఘిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు:3 పోస్టులు
జిల్లా బీసీ అభివృద్ది అధికారి: 5పోస్టులు
జిల్లా గిరిజన సంక్షేమ అధికారి:2 పోస్టులు
జిల్లా ఉపాధి కల్పన అధికారి:5 పోస్టులు
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్:38 పోస్టులు
ఎంపీడీఓ:140 పోస్టులు
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్:41 పోస్టులు

also read:గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ

2022 ఏప్రిల్ మాసంలో  503 పోస్టులకు  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కూడ జరిగింది. అయితే ఈ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో మరోసారి పరీక్షను నిర్వహించారు. అయితే  ఈ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ విషయంలో  నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దరిమిలా ఈ పరీక్షను రద్దు చేయాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో టీఎస్‌పీఎస్‌సీ సవాల్ చేసింది. ఇదే తరుణంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి.  ప్రభుత్వం మారింది.  టీఎస్‌పీఎస్‌సీ కొత్త చైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేసింది.గవర్నర్ కూడ ఆమోదం తెలిపారు.  దరిమిలా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెనక్కి తీసుకుంది. 2022లో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి  ఇవాళ మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.


 

 

click me!