బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఉన్న మెదక్‌లో ఆ పార్టీని ఓడిస్తే.. చావుదెబ్బ తీసినట్టే.. బీఆర్ఎస్‌ను రాష్ట్రంలో తుడిచిపెట్టేసి కాంగ్రెస్ పార్టీ గ్రిప్ తెచ్చుకోవాలని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే మెదక్ లోక్ సభ సీటు కోసం కాంగ్రెస్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించినట్టు సమాచారం.
Medak: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి తొలిసారిగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు తిరుగేలేదు అన్నట్టుగా సాగిన బీఆర్ఎస్.. ప్రతిపక్షానికి రాగానే బలహీనపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో గతంలో తరహా సీట్లు సాధించుకుంటేనే.. బీఆర్ఎస్ పై ఎలాంటి అనుమానాలు రావు. లేదంటే.. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని కింగ్ మేకర్ పాత్ర కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అనే సంశయాలు, ఆందోళనలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ను తుడిచిపెట్టాల్సిందేననే సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్‌ను తుడిచిపెట్టేసి రాష్ట్రంలో గ్రిప్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీ మారుతున్నారు. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇటీవలే చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
undefined
ఇకపోతే పలు సర్వేలు కూడా బీఆర్ఎస్‌కు సానుకూల వాతావరణం లేదని తేల్చి చెబుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అగ్రనాయకులు కేసీఆర్, హరీశ్ రావుల ఎమ్మెల్యే స్థానాలున్న మెదక్ లోక్ సభ సీటుపై ఆశలు ఎక్కువే ఉన్నాయి. మొన్నటి వరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019ay 3.16 లక్షల ఓట్ల మెజార్టీతో ప్రభాకర్ గెలిచారు. బీఆర్ఎస్‌కు కంచుకోటగా ఈ సీటు ఉన్నది. మిగిలిన లోక్ సభ సీట్లల్లోకెల్లా బీఆర్ఎస్‌కు ఈ స్థానంలో బలం ఎక్కువ. అందుకే రేవంత్ రెడ్డి ఈ సీటును కూడా కాంగ్రెస్ గెలిచేసుకుని బీఆర్ఎస్‌ను చావుదెబ్బ తీయాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తున్నది.
Also Read: Janasena: సీఎం జగన్ పంచ్‌లకు నాగబాబు కౌంటర్.. ‘గ్లాస్ సింక్‌లో ఉన్నా.. ’
సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, మెదక్, గజ్వేల్, సిద్దిపేట్, దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్లు మెదక్ పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఆరు బీఆర్ఎస్ గెలుచుకుంది. అయితే.. ఆ మిగిలిన ఒక్కట మైనంపల్లి హన్మంతరావు కొడుకు రోహిత్ రావు మెదక్ నుంచి గెలిచారు.
ఇప్పుడు హన్మంతరావు మెదక్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌లో పని మొదలు పెట్టారు.
మొన్న కేసీఆర్ కూడా గజ్వేల్‌లో స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. అందుకే ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు మంచి అవకాశాలు ఉండొచ్చని మైనంపల్లి అనుకుంటున్నారు. దుబ్బాక, సిద్దిపేటలో మెజార్టీని తనవైపు తిప్పుకుంటే మెదక్ సీటు గెలవడం సులభం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పటాన్‌చెరులో ముదిరాజ్ బలమైన నాయకుడు నీలం మధు మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఇక నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఆమె వర్కర్లు కాంగ్రెస్ వైపు పని చేస్తే మెదక్ ఎంపీ సీటు గెలవొచ్చని మైనంపల్లి అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.
Also Read: తమిళనాడులో కమల్ హాసన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నాడంటే?
సంగారెడ్డిలో కాంగ్రెస్ స్వల్ప తేడాతోనే ఓడిపోయింది. కాబట్టి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌పైనే ఆయన మెయిన్‌గా ఫోకస్ చేస్తున్నారు. ఒక వేళ బీఆర్ఎస్ కంచుకోట మెదక్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. బీఆర్ఎస్ దాదాపు కొలాప్స్ అయినట్టేనని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.