జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి

By Siva KodatiFirst Published Dec 9, 2022, 9:19 PM IST
Highlights

తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర కొనసాగుతున్న సంగతి తెలిసిందే . ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేసేందుకు వరుస పెట్టి నోటిఫికేషన్‌లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కార్. తాజాగా 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. 

తెలంగాణలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,392 లెక్చరర్ల పోస్టులు ఖాళీగా వున్నాయి. 2008లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్‌గా నిలిచింది. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

ఇకపోతే.. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1147 పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 తదితర విభాగాల్లో అత్యధిక ఖాళీలు వున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్‌పై మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందన్నారు. ఈ మేరకు ఆయన నోటిఫికేషన్ కూడా జత చేశారు. 

ALso REad:నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9,168 గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

ఇదిలావుండగా... రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులు భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవలే గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంది. ఆబ్జెక్టివ్ టైప్‌లో పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలిపింది.

అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపింది. వివరణాత్మక నోటిఫికేషన్, వయస్సు, వేతన స్కేల్, విద్యార్హతలు, ఇతర వివరణాత్మక సూచనలు.. కమిషన్ వెబ్‌సైట్  https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టుగా పేర్కొంది.
 

click me!