వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి ఇంట్లో నాలుగో రోజూ ఐటీ సోదాలు.. వెలుగులోకి మరిన్ని అక్రమాలు

By Siva KodatiFirst Published Dec 9, 2022, 8:17 PM IST
Highlights

వంశీ రామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గత మూడ్రోజులుగా ఏపీ, తెలంగాణల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు

వంశీరామ్ బిల్డర్స్‌ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. వరుసగా నాలుగో రోజు ఐటీ అధికారులు వంశీ రామ్ బిల్డర్స్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికారుల తనిఖీల్లో పలు కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయ. భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆస్తుల కొనుగోలు, భూముల లావాదేవీలకు సంబంధించి వంశీ రామ్ అధినేత సుబ్బారెడ్డి, తదితరులు ఐటీ అధికారులకు పూర్తి ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఈ కారణంగానే ఐటీ అధికారుల తనిఖీలకు మరింత సమయం పట్టొచ్చనే సమాచారం . భూముల లావాదేవీల్లో భారీగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన లావాదేవీలకు వంశీరామ్ అండ్ కో చెబుతున్న లెక్కలకు పొంతన కుదరడం లేదని తెలుస్తోంది. వంశీరామ్ బిల్డర్స్ ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలతో లావాదేవీలు జరిపారని, ఈ క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 

ALso Read:సుబ్బారెడ్డి లాకర్స్ తెరిచిన ఐటీ అధికారులు.. భారీగా నగదు, బంగారం, ఆస్తిపత్రాలు స్వాధీనం

కాగా... రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు, ఆదాయ వ్యయాలపై మంగళవారం నుంచి వంశీరామ్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో వున్న డిజిటల్ లాకర్, కుటుంబ సభ్యుల పేరుతో వున్న బ్యాంక్ ఖాతాలు, లాకర్స్‌లో వున్న నగదు, బంగారం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. గత మూడ్రోజులుగా ఏపీ, తెలంగాణల్లోని 30 ప్రాంతాల్లో సోదాలు చేశారు ఐటీ అధికారులు.  గురువారం జరిపిన తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 

click me!