
Telangana BJP chief Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం మరింత ముదురుతోంది. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో టీఎస్ పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటి ? అని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదనీ, నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని స్పష్టం చేశారు.
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని బండి సంజయ్ అన్నారు. బీజేపీ, తమ కార్యకర్తలకు జైళ్లు, నిర్భంధాలు కొత్త కాదనీ అన్నారు. నిరుద్యోగుల కోసం ఎంతవరకైనా పోరాడతామని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం కేసును నీరుగార్చేందుకే సిట్‌కు అప్పగించారని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా పేపర్ లీకేజీపై స్పందిస్తూ.. "బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటి ? అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతాం. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి అని బండి సంజయ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) పరీక్ష పేపర్ లీకేజీకి కారణమైన వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేయడమేంటని ప్రశ్నిస్తూ.. ఆందోళనకారులపై కేసులు పెట్టడాన్ని సిగ్గుచేటు చర్యగా పేర్కొన్నారు. "పేపర్ లీకేజీ కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. తక్షణమే అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలి. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని" బండి సంజయ్ హెచ్చరించారు.
సిట్ పేపర్ లీకేజీ కేసును అప్పగించడంపై మండిపడ్డ బండి సంజయ్.. "ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం తప్పుడు చర్య. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయి. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నాను. సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది" అని పేర్కొన్నారు.