టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. పిల్లల కోసం పేపర్ కొనుగోలు చేసిన కొందరు ప్రజాప్రతినిధులు..!!

By Sumanth KanukulaFirst Published Jun 5, 2023, 1:25 PM IST
Highlights

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ డివిజినల్ ఇంజనీర్(డీఈ) రమేష్.. 80 మందికి పేపర్‌ అమ్మినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు.

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. డీఏవో, ఏఈఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను విక్రయించిన విద్యుత్ శాఖ డివిజినల్ ఇంజనీర్(డీఈ) రమేష్.. 80 మందికి పేపర్‌ అమ్మినట్టుగా గుర్తించారు. ఇందుకుగానూ ఒక్కొక్కరినుంచి రూ. 30 లక్షల బేరం కుదుర్చుకున్నాడు. పూల సురేష్ నుంచి ఏఈఈ పేపర్ ని రమేష్ తీసుకున్నాడని.. అయితే పూల రమేష్‌కు కీలక నిందితుడు ప్రవీణ్ పేపర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్, సురేష్, రమేష్‌లు ఓకే దగ్గర నివాసం ఉండటంతో వీరిమధ్య పరిచయం అయినట్లు సిట్ అధికారులు నిర్దారణకు వచ్చారు. 

వరంగల్ విద్యుత్ శాఖ డీఈగా ఉన్న రమేష్.. తాను పనిచేస్తున్న ఏరియా  పరిధిలో పేపర్లు అమ్మాడు. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని చాలామంది అభ్యర్థులకు ఏఈఈ పేపర్ ను అమ్మినట్లు విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో పలువురు ప్రజాప్రతినిధుల పిల్లలకు కూడా ఉన్నారు. ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ఏఈఈ పరీక్షా పేపర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కరీంనగర్ జిల్లాలకు  చెందిన ఓ మాజీ ఎంపీటీసీ కూడా తన కూతురు కోసం రమేష్ వద్ద నుంచి పేపర్ కొనుగోలు చేసినట్టుగా సమాచారం. ఇక, పరీక్షకు ముందు వారిద్దరు ఒకసారి కలిశారని.. అతడి కూతురికి రమేష్ ఎలక్ట్రిక్ డివైజ్ ఇచ్చాడు. 

ఇక, డీఈ రమేష్.. పేపర్ ఇచ్చేందుకు గాను ఒక్కొక్కరి దగ్గర నుంచి 30 లక్షల రూపాయలకు బేరం కుదర్చుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రమేష్‌ను కోర్టు ఆరు రోజుల కస్టడికి అనుమతి ఇచ్చింది. రమేష్ విచారణతో మరికొందరిని అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

click me!