బీఆర్ఎస్‌ ఎంపీకి షాక్.. పార్థసారథి రెడ్డికి చెందిన ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు..

Published : Jun 05, 2023, 12:57 PM IST
బీఆర్ఎస్‌ ఎంపీకి షాక్.. పార్థసారథి రెడ్డికి చెందిన ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు చేసిన హైకోర్టు..

సారాంశం

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూపు ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది.

బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో గ్రూపు ఛైర్మన్ బండి పార్థసారథి రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. ఇక, ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్ ట్రస్టీగా బండి పార్థసారథి రెడ్డి  ఉన్నారు. వివరాలు.. హైదరాబాద్ ఖానామెట్ వద్ద క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం కోసం సాయి సింధు ఫౌండేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం 2018లో 15 ఎకరాల భూమి కేటాయించింది. అయితే ఇందుకు సంబంధించిన జీవోను సవాలు చేస్తూ 2019లో కొందరు ప్రజా ప్రయోజన వ్యాజాలు దాఖలు చేశారు.

 అయితే తాజాగా వాటిపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. సాయి సింధు ఫౌండేషన్‌ కేటాంపును రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. భూకేటాయింపుల విధానానికి అనుగుణంగా పున:పరిశీలన చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు  సూచించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?