టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమీషన్.. త్వరలోనే ఫైనల్ కీ ఇచ్చి, ఆగస్ట్ తొలి వారంలో రిజల్ట్స్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
తెలంగాణలో ఎన్నో వివాదాలకు కారణమైన టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమీషన్.. త్వరలోనే ఫైనల్ కీ ఇచ్చి, ఆగస్ట్ తొలి వారంలో రిజల్ట్స్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. పేపర్ లీక్ కారణంగా గతంలో రద్దు చేసిన పరీక్షల విషయంలో వేగం పెంచిన కమీషన్.. గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి, మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించింది.
2022 అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశ్నా పత్రం లీక్ కావడంతో ఈ పరీక్షను రద్దు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11న నిర్వహిస్తున్నారు. గతంలో జరిగిన తప్పిదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. 503 పోస్టులకు గాను రాష్ట్రవ్యాప్తంగా 994 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు గాను 3,80, 072 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు.
undefined
ALso Read: గ్రూప్-1 పరీక్షకు అప్లై చేయకపోయినా హాల్‌టికెట్ జారీ చేశారా?.. క్లారిటీ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
మరోవైపు.. ఈ ఏడాది నవంబర్‌లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు భావిస్తోంది. దీనికి సంబంధించి కొద్దిరోజుల క్రితం భేటీ అయిన కమీషన్ ప్రిలిమ్స్ పరీక్ష, ఫలితాలు, మెయిన్స్ నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్రిలిమ్స్ ఫలితాలు రాగానే మెయిన్స్‌కు కొంత సమయం ఇచ్చి నవంబర్‌లో నిర్వహిస్తే ఎలా వుంటుందని యోచిస్తున్నారు.