హైదరాబాద్ లో భారీ వ‌ర్షం.. హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు తెరిచే అవకాశం

By Mahesh Rajamoni  |  First Published Jul 22, 2023, 3:21 PM IST

Hyderabad: హైదరాబాద్ స‌హా తెలంగాణ‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భ‌రీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందని స‌మాచారం. ఇప్ప‌టికే వ‌ర‌ద నీరు భారీ వ‌స్తుండ‌టంతో శుక్రవారం హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
 


Himayatsagr reservior: హైదరాబాద్ స‌హా తెలంగాణ‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భ‌రీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తే అవకాశం ఉందని స‌మాచారం. ఇప్ప‌టికే వ‌ర‌ద నీరు భారీ వ‌స్తుండ‌టంతో శుక్రవారం హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. శుక్రవారం హిమాయత్ సాగ‌ర్ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో వర్షాలు కొనసాగుతుండటంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి అదనపు నీటిని విడుదల చేసిన‌ట్టు సంబంధిత అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గేట్లు ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ ప‌ల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప‌లు చోట్ల భారీ వర్షాలు సైతం కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది. గేట్లు ఎత్తిన తర్వాత మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది.

Himayatsagar lake gates opened. pic.twitter.com/PWYoN40WFz

— Shekhar Bandaru (@BandaruShekhar)

Latest Videos

undefined

ఇదిలావుండ‌గా, రాగల 24 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల 24 గంటల్లో హైదరాబాద్ నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న 24 గంటల్లో హైదరాబాద్ కు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. హైదరాబాద్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

 

రానున్న 24 గంటల్లో మంచిర్యాల, నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి, ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో గోదావరి నదిలోకి భారీగా నీరు వచ్చి పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులను ప్ర‌క‌టించింది. ఎలాంటి అవాంఛనీయ నష్టాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల్లోని పరిపాలన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

click me!