టెట్ ఫలితాలు విడుదల

Published : Aug 04, 2017, 05:21 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
టెట్ ఫలితాలు విడుదల

సారాంశం

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల పేపర్ 2లో 19.51 శాతం ఉత్తీర్ణత పేపర్ 1లో 57.37 ఉత్తీర్ణత

హైదరాబాద్ : టీఎస్ టెట్ -2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. పేపర్ 1లో 57.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2లో 19.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావొచ్చు. జులై 23న టెట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం విదితమే. పేపర్-1 పరీక్షకు 88.59 శాతం మంది, పేపర్-2 పరీక్షకు 90.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,11,647 మంది పేపర్-1 పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 12,742 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 కోసం 2,56,265 మంది రాయాల్సి ఉండగా 25,384 మంది హాజరుకాలేదు.

 

PREV
click me!

Recommended Stories

రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు లేదా..! సింప్లిసిటీలో గుమ్మడి నర్సయ్య నే మించిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇకలేరు
IMD Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్