Hyderabad: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు.
TS Industries Minister KTR: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) మరోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి కుట్రకు తెరలేపుతున్నారని విమర్శించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మెరుగైన పాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
దుండిగల్‌లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాలుపంచుకున్నారు. పేదల ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో గురువారం ఒక్కరోజే 13,300 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు యాజమాన్య హక్కు పత్రాలను అందజేశారు. ఇక్కడ మొత్తం 1800 మంది లబ్ధిదారులకు పత్రాలను అందించనున్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు న్యాయం జరుగుతున్నది, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి అని అన్నారు. హైదరాబాద్‌లో కట్టిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లలో 30 వేల ఇండ్ల పంపిణీ ఇవాల్టితో పూర్తవుతుంది. మిగిలిన 70 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను కూడా అత్యంత పారదర్శకంగా రాబోయే నెల, నెలన్నర కాలంలో అర్హులైన పేదలకు అందజేస్తామని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని విమర్శించారు. సాధ్యంకాని హామీలో మరోసారి ప్రజలు మోసం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు మోసం పోవద్దని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నామని తెలిపారు. పేదలను ఆదుకోవడంలో, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించి హామీలను గురించి ఇదిరకే అసాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని పేర్కొన్న కేటీఆర్... మరోసారి కాంగ్రెస్ హామీలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రగతి చక్రాలను ఆపేందుకు పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఇతర పార్టీల నాయకులు చెప్పినదానికంటే ఎక్కువ మంచిపనులు చేయాలని సీఎం కేసీఆర్ కు ఉందన్నారు. దానికి అనుగుణంగానే సీఎం ఆలోచన చేస్తున్నారనీ, అన్ని విషయాలు త్వరలోనే చెబుతారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ అభివృద్ది పథకంలో తెలంగాణ ముందుకు సాగుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు తాగునీరు అందుతున్నదనీ, ఒకప్పుడు ఏ బస్తీకి పోయిన నీళ్ల కోసం జరిగే లొల్లి ఇప్పుడు కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.