టీఎస్ఆర్టీసీ దసరా పండుగ కోసం బంపరాఫర్ ఇచ్చింది. ఈ పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై పది శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.
హైదరాబాద్: తెలంగాణలో దసరా పండుగ చాలా ఫేమస్. ఎక్కడున్నా అందరూ తప్పకుండా సొంతూరుకు వచ్చి కుటుంబంతో గడుపుతారు. ఈ పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్థికంగా ఊరటనిచ్చేలా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. దసరా కోసం వచ్చే నెల 15వ తేదీ నుంచి 29 తేదీల మధ్య రాకపోకలు చేసే ప్రయాణికులకు పది శాతం స్పెషల్ డిస్కౌట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించింది.
అక్టోబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య రాకపోకల కోసం టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ నెల 30వ తేదీ లోపు ఆ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో టికెట్ పై పది శాతం రాయితీ లభించనుంది.
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice)
Also Read: బుర్ఖా బ్యాన్ చేసిన దేశాల సరసన స్విట్జర్లాండ్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా
ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్ కూడా వెల్లడించింది. రిజర్వేషన్ అందుబాటులో ఉండే ప్రతి బస్సు పై ప్రతి రూట్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ సదుపాయాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.inలోకి వెళ్లాలని సజ్జనార్ ఎక్స్ హ్యాండిల్ తెలిపింది.