తెలంగాణలో సెప్టెంబర్ 1 నుండి విద్యా సంవత్సరం: ఇంటర్‌ సహా పీజీ వరకు ఆన్ లైన్ క్లాసులు

By narsimha lodeFirst Published Aug 25, 2020, 3:47 PM IST
Highlights

 తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీజీ వరకు క్లాసులు నిర్వహించనున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పీజీ వరకు క్లాసులు నిర్వహించనున్నారు.

ఈ నెల 27వ తేదీ నుండి విద్యా సంస్థలకు ఉపాధ్యాయులు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్ లైన్ లో క్లాసుల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.  ఈ మేరకు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది..

also read:గుడ్‌న్యూస్: సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ఆన్‌లైన్ క్లాసులు

ఇంటర్ సెకండియర్, డిగ్రీ, పీజీతో పాటు వృత్తి విద్యా కాలేజీల్లో ఆన్ లైన్ క్లాసులు సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  అంతేకాదు అన్ని రకాల కామన్ ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించాలని కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

యూజీ,పీజీ పరీక్షలను కోర్టు ఆదేశాల ప్రకారంగా నడుచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇంటర్ ఫస్టియర్ తరగతుల  ప్రారంభం గురించి కూడ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే డిగ్రీ ఆడ్మిషన్ల కోసం ఆన్ లైన్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

click me!