గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీజేఎస్ రెడీ: నల్గొండ నుండి కోదండరామ్ పోటీ

By narsimha lodeFirst Published Aug 25, 2020, 11:47 AM IST
Highlights

గ్రాడ్యుయేట్  కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణ జన సమితి నిర్ణయం తీసుకొంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ఆ పార్టీ పోటీ చేసినా కూడ ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీజేఎస్ నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్: గ్రాడ్యుయేట్  కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయాలని తెలంగాణ జన సమితి నిర్ణయం తీసుకొంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ఆ పార్టీ పోటీ చేసినా కూడ ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీజేఎస్ నిర్ణయం తీసుకొంది.

వచ్చేఏడాదిలో పట్టభద్రుల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్  పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  త్వరలో జరిగే సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నట్టుగా టీజేఎస్ నేతలు ప్రకటించారు.

టీజేఎస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కోదండరామ్ అధ్యక్షతన సోమవారం నాడు జరిగింది.  వచ్చే ఏడాదిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించారు. అయితే ఈ విషయమై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొందామని కోదండరామ్ పార్టీ నేతలకు సూచించారు.

మరోవైపు మహబూబ్ నగర్, హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడ పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ స్థానంలో ఎవరిని అభ్యర్ధిగా నిలబెట్టనున్నారనే విషయమై ఇంకా తేలలేదు. 

అయితే వచ్చే ఏడాది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో  పట్టభద్రులతో పాటు  ఇతరులను కూడగట్టాలని టీజేఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఈ విషయమై కసరత్తు చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ అభ్యర్ధిని బరిలో నిలిపింది.  అయితే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించాడు.

రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు  జరగనున్నాయి. అయితే  ఈ స్థానంలో పోటీ చేయాలని టీజేఎస్ యోచిస్తోంది. అయితే దీనిపై ఓ నివేదికను తయారు చేయాలని జేఏసీ చీఫ్ పార్టీ నేతలను ఆదేశించారు.
 

click me!