Bharat Summit 2025 : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత నమ్మకమంటే..: రేవంత్ రెడ్డి

Published : Apr 26, 2025, 06:26 PM ISTUpdated : Apr 26, 2025, 06:37 PM IST
Bharat Summit 2025 : తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎందుకంత నమ్మకమంటే..: రేవంత్ రెడ్డి

సారాంశం

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు నమ్ముతున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అన్నివర్గాల ఆకాంక్షలను నెరవేర్చేలా ఇప్పటివరకు ఏం చేసారో కూడా తెలియజేసారు. ఇలా భారత్ సమ్మిట్ 2025 లో తెలంగాణ సీఎం ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. 

Hyderabad : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ రాజకీయ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు.  శుక్రవారమే ఈ సదస్సు ప్రారంభంకాగా ఇవాళ(శనివారం) కూడా కొనసాగింది. శనివారం హైటెక్స్ లోని నోవాటెల్ లో జరిగిన కార్యక్రమానికి వందకు పైగా దేశాల నుండి 400 పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.   

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు తమ ప్రభుత్వంపై ఇంతలా ఆశలు ఎందుకు పెట్టుకున్నారో వివరించారు. తెలంగాణ సుసంపన్న చరిత్ర,  సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన ప్రాంతమని... అందుకే ఇక్కడి ప్రజలు ఏపీ నుండి విడిపోడానికి పోరాటం చేసారన్నారు. మహిళలు, విద్యార్థులు, కార్మికుల ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు... అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పాలన మీద ప్రజలు ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అన్నారు. అందుకే ప్రతి వర్గం కల నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ అన్నారు.
 
ఇప్పటికే తెలంగాణ రైతాంగానికి  రూ.20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశామని... ఇది దేశంలోనే పెద్ద నిర్ణయమని అన్నారు.   రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు రూ.12,000, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. ఉపాధి హామీ కార్డు దారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తున్నాం.. దీనికి తోడు ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు.  

విద్యార్థులకు కూడా గత 10 ఏళ్లలో ఏం చేయలేకపోయారు... అందుకే సర్టిఫికేట్ ఉన్నా నైపుణ్యం లేక ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయని రేవంత్ అన్నారు. ఇది గుర్తించి తాము అధికారంలోకి రాగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రాజీవ్ యువవికాసం ద్వారా కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. 

తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని... దావోస్ నుండి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే అజెండాగా పెట్టుకున్నామన్నారు.  మహిళలకు సోలార్ పవర్లు ప్లాంట్స్, ఎలక్ట్రిక్ ఆర్టిసి బస్, పెట్రోల్ బంక్స్ ఇస్తున్నామని... దీంతో వారు అదాని, అంబానీలతో పోటీ పడుతున్నారని రేవంత్ అన్నారు. 

మహిళలే ఇంటి యజమానులుగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు. అలాగే మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని... దీనికోసం ఇప్పటివరకు బాగానే ఖర్చుచేసామని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సపోర్ట్ స్కీమ్ ద్వారా రూ.10 లక్షలు ఆర్థిక సాయం, సీఎం రిలీఫ్ పండ్ కింద ఈ ఏడాదిలో రూ.1000 కోట్లు అందించామన్నారు.
 
తెలంగాణ కుల గణన చేపట్టిన మొదటి రాష్ట్రంగా రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణలో దళితుల ఎదుగుతున్నారు అందుకే రాష్ట్రం కూడా ఎదుగుతోందన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ ముందుందన్నారు. తమ పని ఇప్పుడే ప్రారంభమయ్యింది... ఇంకా చాలా చేయాల్సి ఉందన్నారు. ఇక్కడ ఏం చూసారో ప్రపంచానికి చెప్పండి... మా విజన్ ను తెలియజేయండి... తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అని రేవంత్ రెడ్డి సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధులను కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే