పాదయాత్ర నా జీవితాన్నే మార్చేసింది... ఎలాగో తెలుసా? : రాహుల్ గాంధీ 

Published : Apr 26, 2025, 04:45 PM ISTUpdated : Apr 26, 2025, 04:57 PM IST
పాదయాత్ర నా జీవితాన్నే మార్చేసింది... ఎలాగో తెలుసా? : రాహుల్ గాంధీ 

సారాంశం

హైదరాబాద్‌లో జరిగిన భారత్ సమ్మిట్ 2025లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. రాజకీయాల్లో వస్తున్న మార్పులను, సోషల్ మీడియా ప్రభావాన్ని వివరించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకూ చేపట్టిన పాదయాత్రలో వినడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించానని, ఓ మహిళతో జరిగిన సంఘటన ద్వారా ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని తెలిపారు. నాయకులు ప్రజల మాట వినాలని అన్నారు.

Rahul Gandhi : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 అంతర్జాతీయ రాజకీయ సదస్సులో కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సదస్సు నిన్ననే(శుక్రవారం) ప్రారంభంకాగా రాహుల్ గాంధీ హాజరుకావాల్సింది... కానీ కశ్మీర్ పర్యటన కారణంగా ఆయన హాజరుకాలేకపోయారు. ఇవాళ(శనివారం) ఆయన ఈ సదస్సుకు హాజరై ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ప్రస్తుతం రాజకీయాలు ఎలా మారుతున్నాయో రాహుల్ వివరించారు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు చాలా మారాయని.. దశాబ్ద కాలంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. పార్టీలో యువ నాయకులతో మాట్లాడేటపుడు పదేళ్లలో ఏం మారిందో తెలిసిందన్నారు. ఈ మోడ్రన్ మీడియా, మోడ్రన్ సోషల్ మీడియా వల్ల ఈ మార్పు వచ్చిందన్నారు. పాత రాజకీయ నాయకులు చనిపోయారు... కొత్త పొలిటీషన్స్ పుట్టుకు వచ్చారని రాహుల్ అన్నారు. ఇలా కొత్తతరం రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని రాహుల్ అన్నారు. 

పాదయాత్ర తనను ఎలా మార్చిందంటే.. 

కొన్నేళ్లకింద కాంగ్రెస్ పార్టీ ఐసోలేషన్ లో ఉండేది... కొత్త పాలిటిక్స్ వల్ల కాస్త వెనకబడిపోయి ఉండేదన్నారు. దీంతో తాము పాత పద్దతిలో వెళ్లాం... కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు. ఈ 4000 కిలోమీటర్ల పాదయాత్రలో చలా నేర్చుకున్నానని రాహుల్ అన్నారు. 

పాదయాత్ర సమయం నుండే వినడం నేర్చుకున్నానని... అంది ఎంత గొప్ప అలవాటో తనకు అర్థమయ్యిందన్నారు. ఓరోజు ఉదయం నడుస్తుండగా ఓ మహిళ తనవద్దకు వచ్చి నా చేయి పట్టుకుంది... ఆమె చేయి పట్టుకోగానే ఏదో భయంతో ఉందని అర్థమయ్యింది. నేను తొందరగా వెళ్లాలి... నా భర్త కొడుతున్నా మీ కోసం వచ్చానని ఆమె చెప్పింది... దీంతో మీకోసం నేను ఏం చేయాలి అని అడిగానని రాహుల్ తెలిపారు. ఆమె సమాధానం విని ఆశ్చర్యపోయానని... ''ఏం చేయాల్సిన అవసరం లేదు'' అని ఆమె వెళ్లిపోయిందని రాహుల్ తెలిపారు. ఈ సంఘటన ద్వారా మహిళల పరిస్థితి తనకు అర్థమయ్యిందని... వినడం ద్వారానే ఇది సాధ్యమయ్యిందని తెలిపారు. 

అయితే చాలామంది రాజకీయ నాయకులు వినడం మరిచిపోయారని... వినకుంటే ఇలాంటి ప్రజా సమస్యలు ఎలా అర్థమవుతాయని ఆయన ప్రశ్నించారు. కాబట్టి ప్రజాజీవితంలో ఉన్నవారు అందరు చెప్పేది వినాలి... అప్పుడే వారికి ఎలా పాలించాలో అర్థమవుతుందని రాహుల్ అన్నారు. 

'నప్రత్ కే బజార్ మే మొహబత్ కి దుకాన్' నినాదం గురించి రాహుల్ కామెంట్స్ : 

దేశవ్యాప్తంగా చేపట్టిన పాదయాత్ర ద్వారా తనకు ప్రేమ లభించిందని... అలాగే ప్రజలపై తనకున్న ప్రేమను కూడా వ్యక్తం చేయడం తెలిసిందన్నారు రాహుల్ గాంధీ. తనవద్దకు వచ్చిన ఓ చిన్నపాప మనస్పూర్తిగా ఐ లవ్ యూ అంకుల్ అని చెప్పిందని... ఆమె మాటలు తనకెంతో స్పూర్తినిచ్చాయని తెలిపారు. ఇలా పాదయాత్ర ద్వారా వినడం, ప్రేమను వ్యక్తం చేయడం నేర్చుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు. ఇవి తన రాజకీయ జీవితాన్ని మరింత ఈజీ చేసాయన్నారు. 

'నప్రత్ కే బజార్ మే మొహబత్ కి దుకాన్' అనే నినాదం తన పాదయాత్రలో చాలా ఫేమస్ అయ్యిందని రాహుల్ గుర్తుచేసారు. ఇది చాలా పవర్ ఫుల్ స్లోగన్... మనల్ని ద్వేషించేవారిని కూడా ప్రేమించగలడం మంచి లక్షణమని ఆయన అన్నారు. అందుకే పాదయాత్రలో ఈ నినాదం బాగా ఉపయోగించానని రాహుల్ వెల్లడించారు. 

 

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే