ప్రారంభమైన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం: వరి కొనుగోలు సహా కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Dec 17, 2021, 3:23 PM IST
Highlights

పలు కీలక అంశాలపై టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం చర్చిస్తోంది. శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో  టీఆర్ఎస్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది.
 

హైదరాబాద్: Trs రాష్ట్ర స్థాయి విస్తృత్ స్థాయి సమావేశం శుక్రవారం నాడు Telangana Bhavan లో ప్రారంభమైంది. టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం  Kcr అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. పార్టీకి చెందిన  ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా Rythu bandhu కమిటీ చైర్మెన్లకు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. Paddy ధాన్యం సేకరణ విషయమై కేంద్రం నుండి స్పష్టత రాని పక్షంలో యాసంగిలో వరి ధాన్యం పండించవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది. అయితే వరి వేయని రైతులకు మాత్రమే రైతు బంధును కొనసాగించాలనే ప్రతిపాదనను వ్యవసాయ శాఖ చేస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై రైతులు ఏ రకంగా స్పందిస్తారనే విషయమై పార్టీ వర్గాలు మల్ల గుల్లాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు పండించే వారికే రైతు బంధును ఇస్తే రాజకీయంగా లాభ నష్టాలపై కూడా పార్టీ నాయకత్వం చర్చిస్తోంది.

also read:తెలంగాణ‌లో 5 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల నియామ‌కం

వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఒత్తిడిని తీసుకొస్తోంది.పార్లమెంట్ ఉఁభయ సభల్లో ఆందోళనను కొనసాగిస్తోంది.  వరి ధాన్యం పండించని రైతులకు  రైతు బంధు ఇవ్వాలనే నిర్ణయం రైతు బంధును ఎత్తివేసేందుకేనని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ తరుణంలో రాజకీయంగా నష్టం జరగకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై కేసీార్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.క్షేత్రస్థాయిలో రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల వైపునకు మళ్లించేందుకు కూడా రైతు బంధు కమిటీలు సన్నద్దం చేయాలని వ్యవసాయ సూచిస్తోంది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీని ఇరుకున పెట్టేందుకు వరి ధాన్యం అంశాన్ని నెత్తికెత్తుకుంది టీఆర్ఎస్. ఖరీఫ్ లో వరి ధాన్యం సేకరణ విషయంలో  రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బీజేపీ ఎండగడుతుంది.రాష్ట్రంలో యాసంగి పంటల మార్పిడి, బీజేపీ ధ్వంద్వ విధానాలు, దళిత బంధు కార్యక్రమాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులకు శిక్షణతో నామినేటెడ్ పదవుల భర్తీ తదితరుల అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. 

click me!