జనవరిలో కాంగ్రెస్‌లో చేరనున్న డీఎస్: అప్పుడే ఎంపీ పదవికి రాజీనామా

By narsimha lodeFirst Published Dec 17, 2021, 2:26 PM IST
Highlights

వచ్చే ఏడాదిలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని డి.శ్రీనివాస్ నిర్ణయం తీసుకొన్నారు.  కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే  ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయనున్నారు. గురువారం నాడు డి.శ్రీనివాస్ 45 నిమిషాల పాటు సోనియాగాంధీతో భేటీ అయ్యారు.

హైదరాబాద్: మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ వచ్చే ఏడాది జనవరి మాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.  కాంగ్రెస్ పార్టీ చీఫ్ Sonian Gandhi సమక్షంలోనే పార్టీలో చేరాటని D. Srinivas భావిస్తున్నారు. దీంతో సోనియాగాంధీ ఎప్పుడు సమయం ఇస్తే ఆ సమయంలో పార్టీలో చేరడానికి ఆయన సుముఖంగా ఉన్నారు.  రేపు డి.శ్రీనివాస్ ఢిల్లీ నుండి Hyderabadకు రానున్నారు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత తన అనుచరులతో డి.శ్రీనివాస్ భేటీ కానున్నారు.

also read:రేవంత్, భట్టి ఎఐసీసీ నేతల భేటీ రద్దు: రేపు ఢిల్లీ నుండి డీఎస్ హైద్రాబాద్ రాక

Congress పార్టీ చీప్ సోనియాగాంధీ డీ.శ్రీనివాస్  గురువారం నాడు 45 నిమిషాల పాటు బేటీ అయ్యారు.  కాంగ్రెస్ పార్టీని వీడడం తప్పేనని ఆయన పార్టీ అధినేత్రికి చెప్పినట్టుగా సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించిన్టుగా తెలుస్తోంది. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు సోనియాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు డీఎస్ కు అనుమతి లభించినట్టుగా సమాచారం. అయితే సోనియాగాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు డి.శ్రీనివాస్ మొగ్గు చూపుతున్నారు. జనవరి మాసంలోనే ఆయన కాంగ్రెస్ చేరనున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరడానికి ముందే డి.శ్రీనివాస్  Trs ద్వారా లభించిన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు.  

మరో వైపు డీఎస్ Congress పార్టీలో చేరే విషయమై ఆ పార్టీకి చెందిన నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ కష్ట కాలంలో పార్టీని వీడిన డీఎస్ ను తిరిగి పార్టీలో చేర్చుకొనే విషయమై కొందరు నేతలు సుముఖంగా లేరనే ప్రచారం సాగుతుంది. అయితే మరికొందరు నేతలు మాత్రం డీఎస్ ను పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. డీఎస్ పార్టీలో చేరే విషయమై రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో పార్టీ రాష్ట్ర నాయకత్వం చర్చించి అధిష్టానానికి సమాచారం ఇవ్వనుంది.2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు డీఎస్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను కలిశారనే ప్రచారం సాగింది. డీఎస్ కు సన్నిహితులుగా ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనని అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.  అయితే డీఎస్ కాంగ్రెస్ లో చేరడం అప్పట్లో వాయిదా పడింది.

click me!