నల్గొండలో రైలు కింద పడి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. మార్కులు తక్కువొచ్చాయని దారుణం !!

By SumaBala BukkaFirst Published Dec 17, 2021, 1:54 PM IST
Highlights

Nallagonda రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గాంధీనగర్ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి Train కింద పడి Suicide చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో జాహ్నవి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘటన మీద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం Inter First Year Exam Results విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షా ఫలితాల్లో కేవలం 49 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. లాక్ డౌన్, కరోనా ఎఫెక్ట్ కారణంగా పరీక్షల మీద విద్యార్థులు సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో నిన్న విడుదల అయిన ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. అలాగే చాలామంది తక్కువ స్కోర్ తెచ్చుకున్నారు. 

ఇదిలా ఉండగా, Nallagonda రైల్వే స్టేషన్ లో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గాంధీనగర్ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి Train కింద పడి Suicide చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయన్న మనస్తాపంతో జాహ్నవి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుతోంది. అయితే.. ఈ ఘటన మీద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

నిజంగానే ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా,  తెలంగాణలో ఇంటర్ విద్యార్థి ఒకరు suicide చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు viral గా మారింది. గణేష్ రూపాన్ని హ్యాండిల్ నుంచి twitterలో ఈ పోస్ట్ షేర్ అయింది. నా ఆత్మహత్యకు మీరే కారణం అని చెబుతూ మంత్రి కేటీఆర్, అలాగే మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ట్యాగ్ చేశాడు తాజాగా తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్ లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

నా చావుకు కేటీఆరే కారణం.. ఇంటర్ విద్యార్థి సూసైడ్ లెటర్...

 గణేష్ రూపానీ.. ఐ యామ్ గణేష్123 (@iam_ganesh123) అనే హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఈ పోస్ట్ షేర్ అయింది. గైస్ నేను 4 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను అంటూ పోస్ట్ చేశాడు  గణేష్. ‘ఎగ్జామ్ లో ఏం రాసినా పాస్ చేస్తా అని సార్  చెప్పి ఇప్పుడు  అందరినీ ఫైల్ చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ganesh rupani. అంతే కాదు తాను ఇప్పుడే  suicide చేసుకోబోతున్న అంటూ పోస్టులో పేర్కొన్నాడు.  నా ఆత్మహత్యకు మీరే కారణం అని తెలుపుతూ మంత్రి KTR అలాగే మంత్రి Sabita Indrareddy లను టాక్స్ చేశాడు

 రిప్ మీ #RipMe బ్యాండ్ టిఎస్  గవర్నమెంట్ #BanTsGovt అనే హ్యాష్ ట్యాగ్ లతో ఈ ట్వీట్ పోస్ట్ అయ్యింది. అలాగే రూపానీ గణేష్ తన మార్కు లిస్ట్ లను కూడా పోస్ట్ కు అటాచ్ చేశాడు. కేవలం తెలుగు, ఇంగ్లీష్ లో పాస్ అయినట్లు మిగితా సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు అందులో ఉంది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాడు గణేష్. ఈ తెలంగాణ ఇంటర్ బైపీసీ స్టూడెంట్ పోస్ట్ పై గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అలాగే గణేష్ ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఆ విద్యార్థికి  ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే డిలీట్ అయింది.

click me!