
హైదరాబాద్: యూరప్ నుండి వచ్చే వాళ్లపై నిఘా పెంచామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao ఆదివారం నాడు సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. Corona కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉన్నామన్నారు. యూరప్ నుండి వస్తున్న వారిపై నిఘా ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లను ట్రేస్ చేసి టెస్టు చేయడంపై దృఫ్టి పెట్టామని చెప్పారు. Air port నిఘా పెంచుతామని ఆయన వివరించారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కోనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
also read:పెరిగిన కరోనా రికవరీ కేసులు: ఇండియాలో మొత్తం కేసులు 3,45,72,523కి చేరిక
కోవిడ్ వేరియంట్ ఏదైనా సరే కోవిడ్ నుండి మనల్ని కాపాడేది వ్యాక్సినే అని ఆయన అభిప్రాయపడ్డారు.. రెండు డోసులు తీసుకొంటేనే కోవిడ్ నుండి పూర్తి రక్షణగా ఉంటామన్నారు. ఇప్పటివరకు 45 శాతం మంది మాత్రమే Telangana రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకొన్నారని ఆయన తెలిపారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండొద్దని ఆయన సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆయన కోరారు, భౌతిక దూరం పాటించాల్సిందేనని చెప్పారు. Europe లో వ్యాక్సిన్ తీసుకోని వాళ్లే కోవిడ్ బారిన పడుతున్నారన్నారు. స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలే మనల్ని రక్షిస్తాయని డాక్టర్ Srinivasa Rao తెలిపారు. కోవిడ్ పూర్తిగా కనుమరుగు కాలేదు. ఒమిక్రాన్ వైరస్ కొన్ని దేశాల్లో మాత్రమే వ్యాప్తి చెందుతుంది.డెల్టా వేరియంట్ కంటే Omicron వైరస్ 30 శాతం తీవ్రత ఎక్కువగా ఉంటుం
దని ఆయన చెప్పారు.దేశంలో కొత్త వేరియంట్ ఎక్కడా కూడా నమోదు కాలేదని ఆయన గుర్తు చేశారు. కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విమానాశ్రయాల్లోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వారిని కొత్త 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకొన్నారు. నాలుగైదు నెలలగా రాష్ట్రంలో 200 లోపే కోవిడ్ కేసులు నమోదౌతున్నాయని డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు. కరోనా కేసులు తగ్గడం పట్ల కరోనా నిబంధనలు పాటించడంలో కొంత నిర్లక్ష్యం గమనించినట్టుగా ఆయన చెప్పారు కరోనా కొత్త వేరియంట్ ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని డీఎంఈ రమేష్ రెడ్డి తెలిపారు. కొత్త రకం కరోనా వేరియంట్ ఏ మేరకు ప్రమాదకరంగా ఉంటుందనే విషయమై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన చెప్పారు.