తెలంగాణా భవన్ : దేశంలోనే ఆహ్లాదకరమయిన పార్టీ ఆఫీస్

Published : May 10, 2017, 06:29 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
తెలంగాణా భవన్ : దేశంలోనే ఆహ్లాదకరమయిన  పార్టీ ఆఫీస్

సారాంశం

ఏరాష్ట్రంలో ఏ పార్టీ చూపనంత శ్రద్ధతో పార్టీ అధినేత టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణా భవన్ ని తీర్చి దిద్దుతున్నారు. మామూలుగానే చాలా నిశితమయిన వాస్తుసూత్రాల  అనుసరించి కెసిఆర్ నిర్మాణాలను చేపడతారు. అలాంటపుడు తెలంగాణారాష్ట్ర సమితి కార్యాలయం ఎలా ఉంటుందో  వేరే చెప్పనవసరం లేదు. ఇరవై దేశాలనుంచి 30 రకాల మొక్కలను  25 దేశాల నుంచి తెప్పించి ఇక్కడ నాటుతున్నారు. ఈ మొక్కలు మామూలు మొక్కలు కాదు. ప్రతిమొక్కకు అదృష్టం తెచ్చే శక్తి కూడా ఉంది.

తెలంగాణా రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం భారతదేశంలోనే విశిష్టమయిన,సుందరమయిన, అకుపచ్చ ఆవరణగా  మారిపోతున్నది. 

 

ఏరాష్ట్రంలో ఏ పార్టీ చూపనంత శ్రద్ధతో పార్టీ అధినేత టిఆర్ ఎస్ పార్టీ కార్యాలయం, తెలంగాణా భవన్ ని తీర్చి దిద్దుతున్నారు. మామూలుగానే చాలా నిశితమయిన వాస్తుసూత్రాల  అనుసరించి కెసిఆర్ నిర్మాణాలను చేపడతారు. అలాంటపుడు తెలంగాణారాష్ట్ర సమితి కార్యాలయం ఎలా ఉంటుందో  వేరే చెప్పనవసరం లేదు.

 

ఇపుడు నిర్మాణ వాస్తు కు తోడు  హరిత వాస్తు కూడా తెలంగాణా భవన్ కు తోడవుతూ ఉంది. భారతదేశంలో పెరిగే మేలు చేసే మొక్కలనే కాకుండా విదేశాల నుంచి కూడా అరుదయిన మొక్కలనుతెప్పించి తెలంగాణా భవన్ ని పచ్చబరుస్తున్నారు. 30 రకాల మొక్కలను  25 దేశాల నుంచి తెప్పించి ఇక్కడ నాటుతున్నారు. ఈ మొక్కలు మామూలు మొక్కలు కాదు. ప్రతిమొక్కకు అదృష్టం తెచ్చే శక్తి కూడా ఉంది.

 

 దీనితో టిఆర్ ఎస్ ఆఫీస్ దేశంలో ఒక అరుదైన  ఆవరణ గా తయారువుతుంది. రాజకీయ పార్టీ కార్యాలయం అంటే పచ్చి రాజకీయ శిబిరంలా కాకుండా, ఆహ్లాదకరమయిన ప్రదేశంగా ఉండాలనేది కెసిఆర్ ఆలోచన అట. అంతేకాదు, కేవలం రాజకీయనాయకులనే కాదు, పర్యాటకులను కూడా ఆకర్షించేలా తెలంగాణా భవన్ ను రూపొందిస్తున్నారు.

 

బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ఉన్న ఈ భవనాన్ని మరొక రెండు కోట్లు వెచ్చించి వాస్తు దోషాలెక్కడ  ఉన్నా సరిచేసి ఇంకా అధునాతన హంగులు సమకూర్చబోతున్నారు.

 

సాధారణంగా , ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ పార్టీ కార్యాలయాన్ని ఈ విధంగా ఇంతవరకు తీర్చిదిద్ద లేదు.

చాలా కార్యాలయాలలో కార్పొరేట్ హంగులు కేవలం పార్టీ నేత ఛేంబర్ కు పరిమితమవుతుంటాయి. కార్యాలయం ఆవరణను శుభ్రంగా, ఆకర్షణీయంగా, పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో  తీర్చిదిద్దాలనే ఆలోచన పార్టీలకు కనిపించదు.  పార్టీ కార్యాలయం పరిసరాలు చాలా అపరిశుభ్రంగా వుంటాయి. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు  పార్టీ కార్యాలయాలను ఏడాది కొకసారి కూడా సందర్శించారు.

 

ఢిల్లీలోని బిజెపి  కేంద్ర కార్యాలయం(11, అశోక రోడ్ పై ఫోటో)ఎఐసిసి కార్యాలయం(24, అక్బర్ రోడ్ కింది ఫోటో ), కూడ అంతే. నాయకత్వం ఆశాశ్వతం కాబట్టి పదవులను కాపాడుకోవడం మీద చూపిన శ్రధ్ధ పార్టీ కార్యాలయాన్ని ఆకర్షణీయంగా చేయడం మీద చూపరు.

 హైదరాబాద్ లో గాంధీ భవన్, టిడిపి కార్యాలయం(కింద) ఈ కోవలోకే వస్తాయి. పరిసరాలను సుందరీకరించుకుందాం అనే కాన్సెప్ట్ రాజకీయ పార్టీలకు లేదు.

 

PREV
click me!

Recommended Stories

Hyderabad Cold Wave Alert | వాతావరణ పరిస్థితులపై IMD ధర్మరాజు కీలక సమాచారం | Asianet News Telugu
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!