
వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి తెలుసాగా... ఇటీవల తన ఉద్యోగుల కోసం బాహుబలి సినిమా టికెట్ల ను ఏకమొత్తంగా కొని వార్తల్లో వ్యక్తి అయ్యారు. అది వివాదంగానూ మారింది. విమర్శలకు తావుతీసింది.
గతంలో ఆమె కలెక్టర్ హోదాలో ఓ గుడికి వెస్ట్రన్ దుస్తుల్లో వెళ్లడం విమర్శలకు దారితీసింది.అయితే ఇవన్నీ ఆమె వ్యక్తిగతం.
ఉన్నతస్థాయి హోదాలో ఉండటం వల్లే ఇలాంటి పనులు విమర్శలకు గురయ్యాయి.
అయితే పరిపాలనలో మాత్రం ఈ యంగ్ కలెక్టర్ తన దూకుడుతో అందరి నుంచి ప్రశంసలే అందుకుంటున్నారు.
అన్నపూర్ణ పథకంతో ఆ మధ్య జిల్లాలో పేదల ఆకలి తీర్చే వినూత్న పథకానికి నాంది పలికారు.
ఈ రోజు కూడా ఓ మంచి పనిచేసిన ఆమె అందరి మన్నలను పొందారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా హన్మకొండ లోని రెడ్ క్రాస్ కార్యాలయంలో కలెక్టర్ హోదాలో అమ్రపాలి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
అన్ని జిల్లాల్లో కలెక్టర్ లు అదే పనిచేస్తారు కదా... అందులో కొత్తేముంది అని అనుకోకండి. ఆమె అంతటి ఆగలేదు. రక్తదానం చేసి అక్కడున్నవారందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.