ఎంపీ కవితపై  ‘ఈనాడు’  ఆసక్తికర కథనం

First Published May 9, 2017, 10:26 AM IST
Highlights

ఆ గ్రామ బాగోగులన్నీ ఇక ఆ ఎంపీనే చూసుకోవాలి. దాని పనితీరుపై జాతీయ స్థాయిలో మదింపు కూడా జరుగుతుంది.

తెలుగునాట అగ్రశ్రేణి దినపత్రిక అయిన ‘ఈనాడు’ టీఆర్ఎస్ ఎంపీ కవిత పై ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు గతంలో ప్రతీ ఎంపీ ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఆ గ్రామ బాగోగులన్నీ ఇక ఆ ఎంపీనే చూసుకోవాలి. దాని పనితీరుపై జాతీయ స్థాయిలో మదింపు కూడా జరుగుతుంది.తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీ కవిత దత్తత గ్రామంగా తన నియోజకవర్గంలోనే రెంజల్‌ మండలంలోని కందకుర్తి గామ్రాన్ని దత్తత తీసుకున్నారు.

 

గ్రామ అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. రెండు సార్లు ఆ గ్రామంలో పర్యటించారు.అయితే మూడేళ్లు కావొస్తున్నా ఆ గ్రామ రూపురేఖలు మాత్రం మారలేదని ఈనాడు ఓ కథనం రాసింది.

‘ ఎంపీ గ్రామంలో పర్యటించినప్పుడు అన్ని సమస్యలు తీరుతాయని ఆ గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే వారి ఆనందం ఆవిరైంది. ఇప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ’ అని తన కథనంలో పేర్కొంది.

click me!