నెల క్రితం బీజేపీ దయ్యం.. ఇప్పుడు దైవమైందా: ఈటలపై పల్లా విమర్శలు

By Siva KodatiFirst Published Jun 12, 2021, 6:26 PM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. నెల క్రితం బీజేపీపై విమర్శలు చేసిన విషయం ఈటలకు గుర్తు లేదా అంటూ ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలు తెచ్చారని, రైతులపై కాల్పులు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు చేయలేదా అంటూ పల్లా మండిపడ్డారు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. నెల క్రితం బీజేపీపై విమర్శలు చేసిన విషయం ఈటలకు గుర్తు లేదా అంటూ ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలు తెచ్చారని, రైతులపై కాల్పులు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు చేయలేదా అంటూ పల్లా మండిపడ్డారు. నాడు దయ్యాలుగా కనిపించిన బీజేపి నేడు దైవం అయ్యిందా అంటూ రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ భూములు, దేవాదాయ భూములు ఎలా కొంటావంటూ పల్లా ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చింది కేసీఆరేనని గుర్తుంచుకోవాలంటూ ఆయన హితవు పలికారు. 

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. హుజూర్ నగర్ లో జరిగేది కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 

Also Read:ఈటల రాజేందర్ రికార్డు: గత ఏడేళ్లలో ఇలాంటి రాజీనామా ఇదే తొలిసారి

ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు మంత్రులుగా కొనసాగుతున్నారని, పార్ట మారే సమయంలో వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని ాయన అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి స్థితిలో రాజీనామా చేయవద్దని కొందరు చెప్పారని, కేసీఆర్ వద్ద వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతారని, తద్వారా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారని ఆయన అన్నారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు.

అయితే, తాను రాజీనామా చేయడానికే సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. వాళ్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేయాలని చెప్పారని ఆయన అన్నారు హుజూరాబాద్ లో జరిగేది కురుక్షేత్రమేనని ఆయన అన్నారు. హుజూరాబాద్ ప్రజలు నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు భయపడరని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన అన్నారు.

click me!