లాక్‌డౌన్‌ సడలింపులు: తెలంగాణలోకి అనుమతించని పోలీసులు.. సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

By Siva KodatiFirst Published Jun 12, 2021, 3:29 PM IST
Highlights

సూర్యాపేట జిల్లాలోని ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కోదాడ మండలం రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వీకెండ్ కావడంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాల రద్దీ పెరిగింది. పాస్‌లు ఉంటేనే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు పోలీసులు. 

కొద్దిరోజుల క్రితం కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. తెలంగాణలో లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పోలీసు శాఖను ఆదేశించారు. ఆ సమయంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. నాడు ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా వాహనాలను నిలిపివేశారు. ఈ-పాస్‌ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరని పేర్కొన్నారు. 

Also Read:తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు: కేబినెట్‌ కీలక నిర్ణయం, సాయంత్రం 5 వరకు సడలింపు

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ.. సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది. దీంతో వివిధ పనుల నిమిత్తం ఏపీకి వెళ్లి మళ్లీ తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరిన వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలంటూ బాధితులు కోరుతున్నారు. 
 
click me!