కేసీఆర్ ప్రకటనతో వణుకు మొదలు.. బీజేపీ నేతలను జనం తరిమికొడతారు: కడియం శ్రీహరి

Siva Kodati |  
Published : Feb 02, 2022, 04:32 PM ISTUpdated : Feb 02, 2022, 04:36 PM IST
కేసీఆర్ ప్రకటనతో వణుకు మొదలు.. బీజేపీ నేతలను జనం తరిమికొడతారు: కడియం శ్రీహరి

సారాంశం

రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిందే బీజేపీ అన్నారు టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (kadiyam srihari) . అవసరం మేరకు రాజ్యాంగానికి అనేక సవరణలు చేశారని కడియం శ్రీహరి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని శ్రీహరి ఆరోపించారు. బీజేపీ (bjp) నూటికి నూరు శాతం దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. 

రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించిందే బీజేపీ అన్నారు టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ కడియం శ్రీహరి (kadiyam srihari) . బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పెరిగిన జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేంద్రం పెంచడం లేదని కడియం దుయ్యబట్టారు. అవసరం మేరకు రాజ్యాంగానికి అనేక సవరణలు చేశారని కడియం శ్రీహరి గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినంత బడ్జెట్ కూడా కేంద్రం కేటాయించలేదని శ్రీహరి ఆరోపించారు. బీజేపీ (bjp) నూటికి నూరు శాతం దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. 

బీజేపీకి చేతనైతే దళిత బంధును (dalitha bandu) దేశమంతా అమలు చేయాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీల్లో కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పేదలు మరింత పేదలుగా.. ధనికులు మరింత ధనికులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాధించిన అభివృద్ధి బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రకటనతో బీజేపీ  నేతల్లో వణుకు మొదలైందని కడియం శ్రీహరి అన్నారు. అనవసరంగా నోరు పారేసుకుంటే బీజేపీ నేతలను ప్రజలను తరిమికొడతారని ఆయన జోస్యం చెప్పారు. 

కాగా.. దేశంలో కొత్త రాజ్యాంగం రావాల్సిన అవసరం వుందని.. చాలా దేశాలు రాజ్యాంగాలను మార్చుకున్నాయని నిన్న మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా వుంటూనే దేశం కోసం  పోరాడకూడదా అని సీఎం ప్రశ్నించారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా వుంటూనే ప్రధాని కాలేదా అని ఆయన గుర్తుచేశారు. ఫ్రంట్‌లన్నీ దిక్కుమాలిన దందా అని.. దేశంలోని వివిధ రంగాల నిపుణులతో మాట్లాడానని కేసీఆర్ చెప్పారు. తన కర్తవ్యమేంటో నాకు బాగా తెలుసునని.. తెలంగాణలో నా కర్తవ్యాన్ని తాను నిర్వహించానని ఆయన తెలిపారు. 

దేశానికి కొత్త రాజ్యాంగం రావాలన్న దానిపై చర్చ జరగాలని.. కొత్త రాజ్యాంగం అవసరమని తాను ప్రతిపాదిస్తున్నానని సీఎం అన్నారు. దేశంలో చర్చ జరగనివ్వాలని.. బీజేపీ సీఎంలతో తానేందుకు మాట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో వున్న రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని సీఎం ఆరోపించారు. వన్ నేషన్- వన్ రిజిస్ట్రేషన్ (one nation one registration) షుగర్ కోటెడ్ టాబ్లెట్ అని ఆయన అభివర్ణించారు. ఇది రాష్ట్రాల అధికారాలను లాక్కునే ప్రయత్నమేనని కేసీఆర్ ఆరోపించారు. ఫెడరల్ వ్యవస్థను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఎం వ్యాఖ్యానించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu