
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్(chief minister K.Chandrasekhara Rao) పై దేశద్రోహం కేసు పెట్టాలని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్ తరం కాదంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన డిమాండ్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బీఆర్ అంబేద్కర్‌ను అగౌరవపరచడమేనని ఆరోపించారు. ఇలాంటి డిమాండ్ దేశవ్యాప్తంగా అశాంతిని సృష్టిస్తుందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నమని విమర్శించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్ (chief minister K.Chandrasekhara Rao) చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఖండించాలని బండి సంజయ్ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్ కాన్ఫరెన్స్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రాథమిక ప్రజారోగ్య సంరక్షణ కంటే కార్పొరేట్ ఆస్పత్రులకు 'అభిమానం' చూపుతున్న కేసీఆర్ సర్కారు.. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ఆరోగ్యం సహా ఇతర రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇంతకు ముందు ఇదే తెలంగాణ సీఎం కేసీఆర్.. 'గుజరాత్ మోడల్' మరియు వ్యవసాయ చట్టాలను కూడా ప్రశంసించారు. అయితే, ప్రస్తుతం తన రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తూ.. మరో రాగం అందుకున్నారని ఆరోపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశమంతా చర్చ జరగాలని కేసీఆర్ కోరుకోవడం మూర్ఖత్వం కాదా? అని Bandi Sanjay Kumar ప్రశ్నించారు.
ఇప్పటివరకు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశారని సీఎం కేసీఆర్ (chief minister K.Chandrasekhara Rao) పేర్కొనడం హాస్యస్పదంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామని సంజయ్ తెలిపారు. కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడుతూ.. ఇది విప్లవాత్మక బడ్జెట్ అనీ, దేశ పాతికేళ్ల భవిష్యత్తుకు అద్దం పట్టిందని అన్నారు. దేశంలోని కీలకమైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించకుండా ముందుకు సాగిందనీ, దేశహితాన్నే దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాల లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ.. బడ్జెట్ తీసుకువచ్చిందని బండి సంజయ్ (Bandi Sanjay Kumar) తెలిపారు.
కాగా, పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రవంలోనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు, దేశం పూర్తి స్థాయిలో పురోగమించేలా భారతదేశం తన రాజ్యాంగాన్ని తిరగరాయాల్సిన అవసరం ఉందని కూగా సీఎం కేసీఆర్ (chief minister K.Chandrasekhara Rao) పేర్కొన్నారు.