
Revanth Reddy: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో పేదలకు మేలు జరగదని, కేవలం శ్రీమంతులకే ప్రయోజనం చేకూరుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకు మేలు, యువకులకు ఉపాధి, మహిళలకు రక్షణ వంటి అంశాలను పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. జీఎస్టీ సహా ఆదాయపన్ను రేట్లు, స్లాబులు మార్చకపోవడంతో సామాన్యులకు నిరాశే ఎదురైందని పేర్కొన్నారు.
సాగు చట్టాలను వ్యతిరేకించినందకు.. రైతులపై కక్షగట్టి వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని, ఎరువుల సబ్సిడీ తగ్గించారనీ విమర్శించారు. పంటలకు మద్దతు ధర తెస్తారని ఆశించామని ఆయన అన్నారు. రైతుల పోరాటం చూసైనా పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించలేదని, కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే..ఉపాధిహామీ పధకానికి నిధులు తగ్గించారని, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయలేదు… పంట పెట్టుబడి వ్యయాన్ని రెండింతలయ్యేలా ఎరువుల సబ్సిడీ తగ్గించారు అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంగళవారం నాడు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం చాలా చిత్రంగా ఉండనీ, ఆయన మాట తీరు కూడా చిత్రవిచిత్రంగా ఉందనీ, ఆయన మర్యాద లేదని మాట్లాడరని అన్నారు. సీఎం కేసీఆర్ మాటలు బాధ్యతారహితంగా ఉన్నాయని... రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి కేసీఆర్ అడగలేదని వ్యాఖ్యానించారు. కొత్త రాజ్యాంగం తేవాలనే కేసీఆర్ ప్రతిపాదన హాస్యస్పదంగా ఉండని రేవంత్‌రెడ్డి ఏద్దేవా చేశారు. భూస్వాములు, పెట్టుబడిదారుల కోసం కొత్త రాజ్యాంగం కోరుతున్నారా.? అని ప్రశ్నించారు.
బీజేపీ ఆలోచనలనే కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ మరో సారి ఆలోచించాలని అన్నారు. దాదా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యంగం రద్దు చేసి.. రాజులు, సామంతులు, భూస్వాములను అనుకూలమైన రాజ్యాంగాన్ని తీసుకరావాలని బీజేపీ, తెరాసలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. అందుకు కేసీఆర్ మద్దతు పలుకుతున్నారు.
బడ్జెట్లో ఉద్యోగులకు గానీ, నిరుద్యోగులకు గానీ అనువైన నిర్ణయాల్లేవనీ, వైద్య మౌలిక వసతుల కోసం నిధుల కేటాయింపులు లేవని, కరోనా ప్రభావం చూసాక కూడా పేదలకు వైద్యం అందించే చర్యలకు కేటాయింపుల్లేవని అన్నారు. విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు,ఆరోగ్యం ఎవరికి ఉపయోగ పడే నిర్ణయాలు లేవని ఆయన అన్నారు.