టిఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడి వేధింపులు (వీడియో)

Published : Jan 08, 2018, 04:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
టిఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడి వేధింపులు (వీడియో)

సారాంశం

పిచ్చకలాంటి నామీదనా మీ ప్రతాపం నా డబ్బులు నాకిస్తే నేను పోతా ప్రశాంత్ రెడ్డి తమ్ముడు బూతులు తిడుతున్నడు

బాల్కొండ నియోజకవర్గంలోని ఎర్గట్లకు ఆరు నెలల క్రితం కంప్రెషర్ బండి నడిపే సుభాష్ అనే కార్మికుడు నల్లగొండ నుంచి వెళ్లి నివాసముంటున్నాడు. స్థానికంగా క్వారీలో తన కంప్రెష్షర్ బండితో పనిచేస్తున్నాడు. తనను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ్ముడు వంశీరెడ్డి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను చేసే పనికి ఇచ్చే డబ్బు సరిపోతలేదని పెంచాలని అడిగాడు. అయితే పెంచేదిలేదని కంప్రెషర్ బండి అమ్మాలని సుభాష్ పై వత్తిడి చేశారు. బండి అమ్మినా.. ఆ సొమ్ము ఇవ్వకుండా బూతులు తిడుతూ పోలీసుల పేరు చెప్పి బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఆ బాధితుడికి కాంగ్రెస్ నేత రాజారాం యాదవ్ అండగా నిలిచారు. సుభాష్ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడు చెబుతున్న పూర్తి వివరాలు కింద వీడియోలో చూడొచ్చు.

PREV
click me!

Recommended Stories

Harish Rao on Revanth Reddy: పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయాన్ని కూల్చనివ్వం | Asianet News Telugu
హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?