వరంగల్ లో అర్థరాత్రి హై టెన్షన్ (వీడియో)

First Published Jan 8, 2018, 9:14 AM IST
Highlights
  • సోదాల పేరుతో పోలీసుల హల్ చల్
  • బిజెపి నేతల వాహనాలు అటకాయించి చెకింగ్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి శ్రేణులు
  • డబ్బులు పంచుతున్నారని టిఆర్ఎస్ ఫిర్యాదు

వరంగల్ నగరంలోని 44 డివిజన్ ఉప ఎన్నికల ప్రచారం హాట్ హాట్ గా సాగుతున్నది. ఆదివారం అర్థరాత్రి హంగామా చోటు చేసుకుంది. బిజెపి  శ్రేణులకు, పోలీసులకు మధ్య పెద్ద వాగ్యుద్ధం నడిచింది. ప్రచారంలో భాగంగా బిజెపి నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని టిఆర్ఎస్ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు టిఆర్ఎస్ నేతలు.

దీంతో ప్రచారంలో ఉన్న బిజెపి నేతల వాహనాలను అటకాయించి చెకింగ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులకు, బిజెపి నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల వైఖరిని బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.

బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వాహనాన్ని అడ్డుకుని పోలీసులు చెకింగ్ ల పేరుతో హైడ్రామా సృష్టించడంతో బిజెపి నాయకులు సీరియస్ అయ్యారు.

మరోవైపు టిఆర్ఎస్ ఎమ్మెల్యే, మేయర్, స్థానిక నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ తమపై ఆరోపణలు చేయడాన్ని స్థానిక బిజెపి నాయకుడు ఒకరు ఖండించారు. టిఆర్ఎస్ తీరు గురివింజ సామెతను తలపిస్తోందన్నారు. రాత్రి పూట పోలీసుల తీరుతో డివిజన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

బిజెపి వర్సెస్ వరంగల్ పోలీస్ వీడియోను కింద చూడొచ్చు.

 

click me!