తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం కేసీఆర్ ను విమర్శించే హక్కు లేదన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: Telangana కు కేంద్రం అన్యాయం చేస్తున్నా కేంద్ర మంత్రిగా ఉండి Kishan Reddy ఎందుకు మాట్లాడడం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే Balka Suman ప్రశ్నించారు.
TRS ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తున్న సీఎం KCR ను విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామా చేస్తే BJP కి చెందిన కిషన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని అడిగారు.
undefined
తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూల్స్ ను కూడా ఇవ్వకున్నా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఎందుకు కల్పించలేదని కూడా ఆయన అడిగారు. ఈ విషయమై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడం లేదో చెప్పాలన్నారు.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులలో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ పై కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదన్నారు.ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలిపి తెలంగాణను మోసం చేశారని బాల్క సుమన్ విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలను కూడా కేంద్రం అమలు చేయలేదన్నారు.
ఒక్క మంచిపనైనా తెలంగాణ కు కేంద్రం నుంచి చేయించడం చేతగాని దద్దమ్మలాగా కిషన్ రెడ్డి మిగిలిపోయారన్నారు.
తెలంగాణ ను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా? ఆయన అడిగారు.
కిషన్ రెడ్డి ని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తు పట్టరని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఒక దొంగలముఠా అంటూ ఆయన మండి పడ్డారు. జాతీయ కార్యవర్గ భేటీ పేరుతో బిజెపి నాయకులు వసూళ్లకు దిగారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్నారు. బీజేపీ అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడుతామన్నారు. పార్లమెంట్ సాక్షిగా వసూళ్ల దందాను నిలదిస్తామని బాల్క సుమన్ చెప్పారు.