తెలంగాణ టెట్ -2022 ఫలితాల విడుదల: ఫలితాలు చెక్ చేయండిలా...

By narsimha lodeFirst Published Jul 1, 2022, 1:06 PM IST
Highlights

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పేపర్-1, టెట్ పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. ఈ రెండు పరీక్షలు రాసిన అభ్యర్ధుల ఫలితాలను ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసింది. పేపర్ -1 లో 32.68 శాతం, పేపర్-2 లో 49.64 శాతం ఉత్తీర్తులయ్యారు.

హైదరాబాద్: TS TET-2022 (టెట్) ఫలితాలను Telangana ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసింది. టెట్ పరీక్ష ఫలితాలను ఇవాళ విడుదల చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవలనే ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులతో సమీక్ష Sabitha Indra Reddy  సమీక్ష నిర్వహించింది. ఇవాళే  టెట్ పలితాలను విడుదల చేయాలని మంత్రి అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ ఉదయం టెట్ పలితాలు విడుదలయ్యాయి.

 SGT పోస్టులకు టెట్ పేపర్ -1, టెట్ పేపర్ -2 ను School Assistant పోస్టుల కోసం  పరీక్ష నిర్వహించారు. 1వ తరగతి నుండి ఐదవ తరగతి విద్యార్ధులకు బోధించేందుకు ఎస్‌జీటీ ఉపాధ్యాయులు, ఆరో తరగతి నుండి టెన్త్ వరకు స్కూల్ అసిస్టెంట్లు బోధిస్తారు.

టెట్ పేపర్ -1 కు 3,18,506 మంది , పేపర్ -2 కి 2,51, 070 మంది అభ్యర్ధులు పరీక్షలు రాాశారు. అయితే పేపర్ -1లో 1,04,078 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్ -2 లో 1,24,535 అర్హత సాధించారు.టీఎస్ టెట్ పరీక్షలను ఈ ఏడాది జూన్ 12న నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు. ఉదయం పూట పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను తొలుత జూన్ 27న విడుదల చేయాలని భావించారు. అయితే అధికారులు అప్పటిలోపుగా ఫలితాల విడుదలకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో జూలై 1న పరీక్ష పలితాలను విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. 

టెట్ పరీక్ష ఫలితాలను https://tstet.cgg.gov.in , https://tstet results-2022 వెబ్ సైట్ల ద్వారా పలితాలను తెలుసుకోవచ్చుప టెట్ పేపర్-1 పై 7 వేల 930 , పేపర్-2 పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. టెట్ ఫైన్ కీలో 13 ప్రశ్నలను మార్పు చేశారు. 

click me!