రైల్వే పోలీసులు పెట్టినవి తప్పుడు కేసులేనట

First Published Jun 29, 2017, 11:41 AM IST
Highlights

పంచ్ డైలాగులకు పెట్టింది పేరైన తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మరోసారి పంచ్ డైలాగ్ పేల్చారు. తెలంగాణ రాకముందు రైల్వేస్టేషన్ వద్దకు వెళ్లిన తమపై రైల్వే పోలీసులు తప్పుడు కేసులు పెట్టిర్రని ఆరోపించారు నాయిని. గురువారం రైల్వే కోర్టు కే హోమంత్రి నాయిని, మంత్రి కెటిఆర్ ఇతర టిఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయిని నమాట్లాడుతూ రైల్వే పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రైల్వేస్టేషన్ కు వెళ్లిన మాట నిజమే కానీ, రైళ్లు ఆపలేదని వివరణ ఇచ్చారు. ఈ విషయానే జడ్జికి కూడా చెప్పినం అని నాయిని వివరించారు. కేసు వచ్చేనెల 19కి వాయిదా పడింది.

మొత్తానికి పోలీసులు తప్పుడు కేసులు పెడతారన్న విషయాన్ని స్వయానా పోలీసు మంత్రే చెప్పడంతో చర్చనీయాంశమైంది. మరి నాయిని గారు మీ కింద పనిచేస్తున్న పోలీసులు కూడా తప్పుడు కేసులు పెట్టగాలే జాగ్రత్త అని నెటిజన్లు చురకలేస్తున్నారు.

click me!