అక్బరుద్దీన్ పై దాడి కేసులో నేడు తీర్పు

Published : Jun 29, 2017, 11:13 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
అక్బరుద్దీన్ పై దాడి కేసులో నేడు తీర్పు

సారాంశం

ఫ్లాష్ న్యూస్ ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దీన్ పై హత్యాయత్నం కేసులో నేడు తీర్పు వెలువడనుంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అదనపు పోలీసు బలగాలను రప్పించి భద్రతను కట్టుదిట్టం చేశారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య కేసులో నిందితుడైన మహ్మద్ పహిల్వాన్ ను కోర్టుకు తీసుకురానున్నారు పోలీసులు.

ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ పై 2011లో హత్యాయత్నం జరిగింది.  ఈ కేసులో ఇప్పటి వరకు 13 మంది నిందితులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. 19 మంది సాక్ష్యులను విచారించింది నాంపల్లి కోర్టు. అలాగే అక్బరుద్దీన్ స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు.

దాడి జరిగిన 6 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఇటు ఎంఐఎం వర్గాల్లో, అటు పహిల్వాన్ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 30వ తేదీ 2011లో అక్బర్ పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. అక్బర్ శరీరలోకి 3 బుల్లెట్లు,  5 కత్తిపోట్లు దిగాయి.   కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే