200రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయి

First Published Jun 29, 2017, 10:34 AM IST
Highlights

పాత నోట్ల రద్దు నిర్ణయంతో జనాలను అష్టకష్టాల పాలు చేసిన ఆర్బీఐ తాజాగా ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. మార్కెట్లోకి 200 రూపాయల నోట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. చిల్లర సమస్యకు పరిష్కారం చూపేందుకే ఈ కొత్త నోట్ల ముద్రణ చేపట్టనున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పాత నోట్ల రద్దు నిర్ణయంతో జనాలను అష్టకష్టాల పాలు చేసిన ఆర్బీఐ తాజాగా ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. మార్కెట్లోకి 200 రూపాయల నోట్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

 

ఇప్పటి వరకు ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో కొత్త 500 నోట్లు ముద్రించింది. దీంతోపాటు 2వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. 2000 రూపాయల నోటుతో జనాలకు చిల్లర సమస్య ఉత్పన్నమవుతోంది. దీన్న దృష్టిలో ఉంచుకుని తాజాగా 200 రూపాయల నోటును ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది ఆర్బీఐ.

 

దేశంలో నోట్ల రద్దు వల్ల ఏర్పడిన కరెన్సీ కొరత, చిల్లర సమస్యను అధిగమించేందుకు వీలుగా కొత్తగా అడ్వాన్సు హై సెక్యూరిటీ ఫీచర్లతో ఈ రూ.200నోటును ముద్రిస్తోంది. రిజర్వుబ్యాంకు తన సొంత ప్రెస్ లోనే ఈ కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ప్రారంభించిందని ప్రచారం సాగుతోంది. ప్రజల రోజువారీ ఆర్థిక లావాదేవీల కోసం 200 రూపాయల నోటు విడుదల చేయడం చాలా ఉపయోగమని ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యాకాంతి వెల్లడించారు.

 

పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటు వల్ల ప్రజలు చిల్లర సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా విడుదల కానున్న రూ.200 నోటుతో ప్రజల చిల్లర కష్టాలు తీరుతాయని వ్యాపారులు అంటున్నారు.

click me!